కరెంటు పని చేసేటప్పుడు భద్రతపరమైన ప్రమాదాలను నివారించాలనుకుంటున్నారా?

ఆగస్టు 25, 2020

మీ ఇంటి నిర్మాణంలో తుది దశల్లో చేసే పనుల్లో కరెంటు పని ఒకటి. అయితే, ఈ దశలో, మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఎందుకంటే, ప్రమాదాల వల్ల తీవ్ర సమస్యలు మరియు భద్రత ప్రమాదాలు కలుగుతాయి.

కొన్ని ముఖ్యమైన కరెంటు సురక్షిత సూచనలను ఇక్కడ ఇస్తున్నాము.

  • మీరు మీ ఇంటి నిర్మాణం ప్రారంభించే ముందు, వైరింగ్‌ మరియు కరెంటు అవుట్‌లెట్‌లన్నిటి లొకేషన్‌లను మీరు తప్పకుండా ప్రణాళిక చేసుకోవాలి.
  • మీ కరెంటు పని మొత్తాన్ని సర్టిఫైడ్‌ కరెంటు కాంట్రాక్టరును సంప్రదించడం మంచి ఆలోచన.
  • మీ ఇంటికి తప్పకుండా ఎర్తింగ్‌ని సరైన విధంగా చేయించాలి. దీనిని ధృవీకరించేందుకు మీ ఇంజినీర్‌ మీకు సహాయపడతారు.
  • నాణ్యమైన కరెంటు మెటీరియల్స్‌ని పొందాలంటే, కొనడానికి ముందు ఐఎస్‌ఐ మార్క్‌ ఉందా అనే విషయం చెక్‌ చేయండి.
  • ఒకే విద్యుత్తు పాయింటులో కనెక్షన్‌లు చాలా ఎక్కువగా లేకుండా ఉండాలంటే, మీ కరెంటు ఉపకరణాలన్నిటికీ ఫ్యూజ్‌ ఉపయోగించండి.
  • కరెంటు కనెక్షన్‌లు మరియు పాయింట్లు అన్నిటినీ నీటి వనరులకు దూరంగా ఉంచండి.
  • చివరిగా, క్షుణ్ణంగా చెక్‌ చేసి లైవ్‌ వైర్‌లు ఏవీ లేవని నిర్థారించుకోవాలి.

మీ ఇంటికి కరెంటు పని ఏదైనా చేసేటప్పుడు సమస్యలు ఏవీ కలగకుండా ఉండేందుకు భద్రతపరమైన ఈ సూచనలను దృష్టిలో ఉంచుకోండి.


అందుబాటులో ఉండు

మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి

చెల్లుబాటు అయ్యే పేరును నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే నంబర్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే పిన్‌కోడ్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే కేటగిరీని ఎంచుకోండి
చెల్లుబాటు అయ్యే ఉప కేటగిరీని నమోదు చేయండి

ఈ ఫారమ్‌ను సమర్పించడం ద్వారా మిమ్మల్ని సంప్రదించడానికి మీరు అల్ట్రాటెక్ సిమెంట్‌కు అనుమతినిస్తున్నారు.

దయచేసి ముందుకు కొనసాగించడానికి ఈ పెట్టెను ఎంచుకోండి