అందుబాటులో ఉండు

మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి

చెల్లుబాటు అయ్యే వర్గాన్ని ఎంచుకోండి

మీ ఉప-కేటగిరీని ఎంచుకోండి

acceptence

దయచేసి తదుపరి కొనసాగించడానికి ఈ పెట్టెను ఎంచుకోండి

hgfghj


నిర్మాణంలో పాయింటింగ్ అంటే ఏమిటి? దాని రకాలు, ప్రయోజనాలూ, లక్ష్యం

నిర్మాణంలో వివిధ రకాల పాయింటింగ్‌ల గురించి తెలుసుకోండి, ఇటుక కట్టడం, రాతి కట్టడం నిర్మాణాలలో బలం, మన్నిక, సౌందర్యాన్ని మెరుగుపరచడానికి వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

Share:


ఇటుక లేదా రాతి నిర్మాణాల నిర్మాణం విషయానికి వస్తే, మనం పట్టించుకోవాల్సింది కేవలం ధృడమైన పునాది లేదా పదార్థాల ఖచ్చితమైన అమరిక గురించి మాత్రమే కాదు. ఒక సాధారణ నిర్మాణ ప్రాజెక్ట్ కీ, ఒక అద్భుతమైన కళాఖండానికీ గల వివరాలలో తేడా శ్రద్ధ అనే దాని వల్ల వస్తుంది. ఇలాంటి వివరాలలో ఒకటి పాయింటింగ్. ఇది నిర్మాణ సమగ్రత, తాపీ పని ఈ రెండింటి కలయికతో మొత్తం భవన సౌందర్యంలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది.నిర్మాణంలో పాయింటింగ్ అంటే ఏమిటి?పాయింటింగ్ అనే పదాన్ని సూటిగా చెప్పాలంటే, మోర్టార్ లేదా ఇతర తగిన పదార్థాలతో ఇటుకలు లేదా రాళ్ల మధ్య ఖాళీల్ని పూరించే కళని గురించి తెలియజేస్తుంది. ఇది భౌతికమైన పనిలా అనిపించినప్పటికీ, పాయింటింగ్ అనేది సరిగా చేస్తే సాధారణ గోడను కళాకృతిగా మారుస్తుంది. కానీ పాయింటింగ్ అనేది కేవలం బయటికి అందంగా కనిపించడం గురించి మాత్రమే కాదు; ఇది అనేక ప్రయోజనాలను అందిస్తుంది, అలాగే నిర్మాణ ప్రాజెక్ట్ కి దీర్ఘకాలిక మన్నికనిస్తుంది, ఇంకా పనిసామర్థ్యాని (ఫంక్షనాలిటీ)కి దోహదపడే అనేక ప్రయోజనాలను అందిస్తుంది.


ఈ బ్లాగ్ పోస్ట్ లో, మేము నిర్మాణంలో పాయింటింగ్ కి సంబంధించిన ప్రపంచాన్ని నిశితంగా పరిశీలిస్తాము. మనం దీని అర్థం గురించీ, వివిధ రకాల పాయింటింగ్, ప్రయోజనాలు, అవి అందించే సేవల్ని విశ్లేషిద్దాం. కాబట్టి, మీరు నిర్మాణ రంగంలో ఔత్సాహికులైనా, గృహయజమాని అయినా, తాపీపని గురించి లోతైన వివరాలను అర్థం చేసుకోవాలని చూస్తున్నారా లేదా మీరు పాయింటింగ్ కళపై ఆసక్తి ఉన్నవారైనా, ఈ నిర్మాణ సాంకేతికత ప్రాముఖ్యతని అభినందించడానికి ఈ బ్లాగ్ మీకు మంచి జ్ఞానాన్ని అందిస్తుంది.

పాయింటింగ్ రకాలునిర్మాణంలో పాయింటింగ్ అనేక రకాల సాంకేతికతలను కలిగి ఉంటుంది, ప్రతి ఒక్క దానికీ దానిదైన సొంత ఆకర్షణ ఉంటుంది, దాని కార్యసామర్థ్య (ఫంక్షనల్) ప్రయోజనాలు ఉంటాయి. తాపీపనిలో ఉపయోగించిన కొన్ని ప్రముఖ రకాల పాయింటింగ్‌ల గురించి తెలుసుకుందాం.

 

 • 1) ఫ్లష్ పాయింటింగ్

 • ఫ్లష్ పాయింటింగ్ అనేది రాతిపనిలో విస్తృతంగా ఉపయోగించే మరియు మన్నికైన పాయింటింగ్ రకం. ఈ టెక్నిక్‌లో, రేక్ చేయబడిన మోర్టార్ జాయింట్లు మోర్టార్‌తో జాగ్రత్తగా నింపబడి ఉంటాయి, అలాగే ఏదైనా అదనపు మోర్టార్ ఖచ్చితంగా తీసివేయబడుతుంది, ఫలితంగా నునుపైన, గతుకులు లేని ఫినిష్ ఇవ్వబడుతుంది. మోర్టార్ జాయింట్ ఇటుక లేదా స్టోన్ ఫేస్ తో ఫ్లష్ చేయబడుతుంది, ఇది చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తుంది. దుమ్ము లేదా నీరు నిల్వ ఉండకుండా ఖాళీలను తొలగిస్తే ఫ్లష్ పాయింటింగ్ నిర్మాణం ఎక్కువ కాలం నిలుస్తుంది, అలాగే నిర్మాణ శుభ్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
 • 2) రీసెస్డ్ పాయింటింగ్

 • రీసెస్డ్ పాయింటింగ్ అనేది చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండే పాయింటింగ్ రకం. ఇందులో మోర్టార్‌తో మోర్టార్‌తో నింపి, తగిన సాధనాన్ని ఉపయోగించి గోడ ఉపరితలం నుంచి లోపలికి నొక్కడం జరుగుతుంది. ఈ సాంకేతికత పాయింటింగ్ ఫేస్ ని నిలువుగా 5 మి.మీ. లేదా అంతకంటే ఎక్కువ లోతుని ఏర్పరుస్తుంది. ఫలితంగా ఇది ఒక విలక్షణమైన సౌందర్య రూపాన్ని కలిగి ఉంటుంది. రీసెస్డ్ మోర్టార్ జాయింట్ రాతికి లోతునీ, చక్కటి షాడో లైన్స్ నీ ఏర్పరుస్తుంది.
 • 3) బీడెడ్ పాయింటింగ్

 • బీడెడ్ పాయింటింగ్ అనేది పుటాకార ఆకారంతో ఉక్కు సాధనాన్ని ఉపయోగించి రాతి జాయింట్‌లోకి మోర్టార్‌ను గట్టిగా తోస్తూ పుటాకారపు ఆకృతిలో పొడవైన కమ్మీలను సృష్టించడం. ఈ సాంకేతికత ఒక విలక్షణమైన బీడెడ్ రూపాన్ని కలిగి ఉన్న మోర్టార్ జాయింట్‌కి దారి తీస్తుంది, భవన సౌందర్యం అంతటికీ ఒక వింతైన సొగసుని తెస్తుంది. బీడెడ్ పాయింటింగ్ అద్భుతమైన ఆకర్షణీయమైన రూపం తెస్తుంది, ఇతర పద్ధతులతో పోలిస్తే ఈ రకమైన పాయింటింగ్ దెబ్బతినడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని గమనించాలి.
 • 4)స్ట్రక్ పాయింటింగ్

 • స్ట్రక్ పాయింటింగ్ అనేది మోర్టార్ జాయింట్ కోసం నిర్దిష్ట ప్రొఫైల్‌ను సాధించడానికి రెండు-స్టెప్‌ల ప్రక్రియను కలిగి ఉంటుంది. మొదటిది, మోర్టార్ నింపబడుతుంది, తాపీ పనివారు ఇటుక ముఖానికి సరిపోయేలా నొక్కి సరి చేస్తారు. అప్పుడు, పైనున్న అంచు జాయింటుని లోపలికి నొక్కడం జరుగుతుంది. ఆ విధంగా అది దిగువ మూలతో పోలిస్తే సుమారు 10 మిమీ వాలుని ఏర్పరుస్తుంది. ఇలా ఏటవాలుగా ఉండడంతో వర్షపు నీరు వేగంగా పారి, రాతి ఉపరితలంపై నీరు నిలవడాన్ని తగ్గిస్తుంది.
 • 5) రబ్డ్, కీడ్ లేదా గ్రూవ్డ్ పాయింటింగ్

 • రబ్డ్, కీడ్ లేదా గ్రూవ్డ్ పాయింటింగ్ అనేది ఫ్లష్ పాయింటింగ్‌తో సారూప్యత (సిమిలారిటీ)లను పంచుకునే ఒక రకమైన పాయింటింగ్. ఈ టెక్నిక్‌లో, రేక్డ్ జాయింట్ మోర్టార్‌తో నిండి ఉంటుంది మరియు ఇటుక లేదా రాతి ఫేస్ తో ఫ్లష్‌ను లెవల్ చేస్తుంది. ఏదేమైనా, ఈ రకమైన పాయింటింగ్‌ను వేరుగా ఉంచేది పాయింటర్ అని పిలువబడే ప్రత్యేక సాధనాన్ని ఉపయోగించి మధ్యలో ఏర్పడిన గాడిని జోడించడం జరుగుతుంది. ఈ గ్రూవ్, పాయింటింగ్‌కు ఒక ప్రత్యేకమైన ఆకర్షణని కలిగించి గొప్ప సౌందర్యానుభూతిని ఇస్తుంది.
 • 6) టక్ పాయింటింగ్

 • టక్ పాయింటింగ్ అనేది ఒక ఖచ్చితమైన రకమైన పాయింటింగ్, ఇందులో మోర్టార్‌తో రేక్ చేయబడిన జాయింట్‌ను నింపి, ఆపై జాయింట్ మధ్యలో గాడిని సృష్టించడం ఉంటుంది. గాడి నిర్దిష్ట కొలతలు, సాధారణంగా 5 మి.మీ. వెడల్పు మరియు 3 మి.మీ. లోతుతో జాగ్రత్తగా తయారు చేయబడుతుంది. తెల్లటి సిమెంట్ పుట్టీతో గాడిని నింపడం లేదా "టకింగ్" చేయడం తదుపరి దశ, దాదాపు 3 మి.మీ. ఈ సాంకేతికత మోర్టార్ మరియు వైట్ పుట్టీ మధ్య చూడడానికి ఆకర్షణీయంగా చేసి టాపీ పనితనాన్ని మరింత మనోహరంగా చేస్తుంది.
 • 7) వి పాయింటింగ్

 • V పాయింటింగ్ అనేది కూడా కీడ్ పాయింటింగ్ పని లాంటి సాంకేతికత కలిగి ఉంటుంది. జాయింట్‌లోకి మోర్టార్‌ను పూరిస్తూ ఫ్లష్ కి మంచి ఫినిష్ వచ్చేలా లోపలికి నొక్కడం ద్వారా ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. V పాయింటింగ్ విశిష్ట లక్షణం జాయింట్ లోపల V- ఆకారపు గాడి యొక్క తదుపరి నిర్మాణం. ఈ గాడి V ఆకారంలో ఉన్న ప్రత్యేక సాధనాన్ని ఉపయోగించి సృష్టించబడింది, ఇది సాంకేతికతకు దాని పేరును ఇస్తుంది.
 • 8) వెదర్డ్ పాయింటింగ్

 • వెదర్డ్ పాయింటింగ్ అనేది మోర్టార్‌ను జాయింట్‌లోకి నొక్కే టెక్నిక్, పైగా అది మోర్టార్ తాజాగా ఉన్నప్పుడే, అడ్డంగా ఉండే జాయింట్ల పై భాగాన్ని పాయింటింగ్ సాధనాన్ని ఉపయోగించి నైపుణ్యంగా 3-6 మిమీ వెనుకకు నొక్కడం జరుగుతుంది. ఇది జాయింట్ ఎగువ నుండి దిగువకు విలక్షణమైన వాలు ప్రభావాన్ని సృష్టిస్తుంది, ఇది వెదర్డ్ లేదా అరిగిపోయిన అంచుల్లా ఉన్నట్టు కనిపిస్తుంది.

 

నిర్మాణంలో పాయింటింగ్ ప్రయోజనాలు

రాతి నిర్మాణాల మన్నిక మరియు సౌందర్యాన్ని పెంపొందించడంలో పాయింటింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇటుకలు లేదా రాళ్ల మధ్య ఖాళీలను సరిగ్గా పూరించడం ద్వారా, పాయింటింగ్ భవనానికి సంబంధించిన మొత్తం నాణ్యత, విలువకు దోహదపడే అనేక ప్రయోజనాలను అందిస్తుంది. నిర్మాణంలో వివిధ రకాల పాయింటింగ్ కి సంబంధించిన కొన్ని ముఖ్య ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి:

 

1) నిర్మాణ సమగ్రతను మెరుగుపరుస్తుంది, బలమైన భవన నిర్మాణం జరుగుతుంది.

2) వాతావరణ నిరోధకతని అందిస్తుంది, బయటి గోడలకు తేమ రాకుండా కాపాడుతుంది.

3) మొత్తం భవన రూపాన్ని తిరిగి అద్భుతంగా కనిపించేలా చేస్తుంది, దాని సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది.

4) మీ ఆస్తి విలువను పెంచుతుంది, ఇది అందరూ కావాలని కోరుకునేలా చేస్తుంది.

5) కొనసాగుతున్న నిర్వహణ అవసరాలను తగ్గిస్తుంది, సమయం మరియు ఖర్చులను ఆదా చేస్తుంది.

 

 

నిర్మాణంలో పాయింటింగ్ ఉద్దేశ్యం • 1) రక్షణ

 • పాయింటింగ్ మోర్టార్ జాయింట్లను వాతావరణంలోని హానికరమైన ప్రభావాల నుండి రక్షిస్తుంది, వాటిని ఎక్కువ కాలం మన్నేలా చేసి బలంగా ఉండేలా చేస్తుంది.
 • 2) మరింత సమ్మోహనంగా చేస్తుంది

 • పాయింటింగ్ గోడ రూపాన్ని మెరుగుపరుస్తుంది, జాయింట్ల నమూనా, మందం, రంగులు మరియు ఆకృతిని హైలైట్ చేస్తుంది.
 • 3) వాతావరణ నిరోధకం

 • పాయింటింగ్ ఖాళీలను మూసివేయడంలో సహాయపడుతుంది మరియు వర్షపు నీరు లేదా తేమ రాతిలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది, బాహ్య కారకాల ప్రతిఘటన నుండి నిర్మాణం తట్టుకునే శక్తిని పెంచుతుంది.
 • 4) బలోపేతం చేయడం

 • మోర్టార్ జాయింట్లను పూరించడం మరియు బలోపేతం చేయడం ద్వారా, పాయింటింగ్ మొత్తంగా తాపీ పనితనం బలంగా ఉండేలానూ, స్థిరంగా ఉండేలానూ చేస్తుంది.
 • 5) సంరక్షణ


 • సరైన పాయింటింగ్ నీరు చొచ్చుకుపోకుండా చేస్తుంది, అంతర్లీన నిర్మాణానికి ఇక ఎంతమాత్రం నష్టం కలగకుండా చేయడం వల్ల భవన సమగ్రతను కాపాడటానికి సహాయపడుతుంది.

మోర్టార్ రకాలు

 • 1) సున్నం మోర్టార్

 • కొవ్వు సున్నం, కొవ్వు ఇసుక మరియు నీటిని తగిన నిష్పత్తిలో కలపడం ద్వారా దీనిని తయారు చేస్తారు. చాలా సాధారణంగా, పాయింటింగ్ పని కోసం 1:2 లేదా 1:3 యొక్క సున్నపు మోర్టార్ నిష్పత్తులను ఉపయోగిస్తారు. ఇది పాత, కొత్త నిర్మాణాలలో ఉపయోగించబడుతుంది. పైగా అది అద్భుతమైన పనితనాన్నీ, ఫ్లెక్సిబిలిటీనీ కలిగి ఉంటుంది.
 • 2) సిమెంట్ మోర్టార్

 • సిమెంట్, ఇసుక మరియు నీటిని నిర్దిష్ట నిష్పత్తిలో కలపడం ద్వారా సిమెంట్ మోర్టార్ సృష్టించబడుతుంది. సాధారణంగా నిష్పత్తి 1:3. సిమెంట్ మోర్టార్ అధిక బలం మరియు మన్నికను అందిస్తుంది, ఇది వివిధ రకాల తాపీ పనికి అనుకూలంగా ఉంటుంది.


ముగింపులో, నిర్మాణ సమగ్రతను పెంపొందించడానికి, వెదర్‌ఫ్రూఫింగ్‌ను అందించడానికి, రూపాన్ని పునరుద్ధరించడానికి మరియు నిర్వహణను తగ్గించడానికి నిర్మాణంలో పాయింటింగ్ చాలా ముఖ్యమైనది. ఇటుక లేదా రాతి నిర్మాణాలలో దీర్ఘకాలం మరియు సౌందర్యపరంగా ఆహ్లాదకరమైన ఫలితాల కోసం సరైన రకాల పాయింటింగ్ పద్ధతులు మరియు మోర్టార్‌ను ఎంచుకోవడం చాలా అవసరం.సంబంధిత కథనాలు
సిఫార్సు చేయబడిన వీడియోలు

గృహ నిర్మాణానికి ఉపకరణాలు


ఖర్చు కాలిక్యులేటర్

ప్రతి ఇంటిని నిర్మించేవారు తమ కలల ఇంటిని నిర్మించాలనుకుంటున్నారు, కాని అధిక బడ్జెట్‌కు వెళ్లకుండా అలా చేస్తారు. 

logo

emi కాలిక్యులేటర్

గృహ-రుణం తీసుకోవడం అనేది గృహనిర్మాణానికి ఆర్థిక మార్గంగా చెప్పవచ్చు, కాని గృహనిర్మాణదారులు వారు ఎంత EMI చెల్లించాలో తరచుగా అడుగుతారు.

logo

ప్రొడక్ట్ ప్రిడిక్టర్

ఇంటిని నిర్మించే ప్రారంభ దశల్లో గృహ నిర్మాణదారు సరైన ఉత్పత్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

logo

స్టోర్ కాలిక్యులేటర్

ఇంటి బిల్డర్ కోసం, ఇంటి భవనం గురించి విలువైన సమాచారాన్ని పొందగలిగే సరైన దుకాణాన్ని కనుగొనడం చాలా ముఖ్యం.

logo

  Tools for Home Building


Cost Calculator

Estimate your
homebuilding expenses
and plan your budget
 

logo

EMI Calculator

Planning to take a loan? Get an estimate of your EMIs with the help of our EMI calculator

logo

Product Find

Find the right product for each of your construction needs

logo

Store Locator

Get in touch with the nearest UltraTech Building Solutions store

logo

Loading....