అందుబాటులో ఉండు

మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి

చెల్లుబాటు అయ్యే వర్గాన్ని ఎంచుకోండి

మీ ఉప-కేటగిరీని ఎంచుకోండి

acceptence

దయచేసి తదుపరి కొనసాగించడానికి ఈ పెట్టెను ఎంచుకోండి

దెబ్బతిన్న రోడ్లు దీర్ఘకాల సమస్య

 

వేగవంతమైన పట్టణీకరణ ఫలితంగా, 35% మంది భారతీయులు ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు మరియు గతంలో కంటే నగర రహదారులపై ప్రయాణిస్తున్నారు. ప్రపంచంలో భారత దేశం 4 వ పెద్ద ఆటో మార్కెట్ కల్గి ఉంది రాబోయే సంవత్సరాల్లో రోడ్లు వాహనాలతో మరింత రద్దీగా ఉంటాయి. ఇది మన రహదారులపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుంది, ఫలితంగా బీటలు మరియు ప్రమాదకరమైన గుంతలు ఏర్పడతాయి. వాస్తవానికి, గత నాలుగేళ్లలో, గుంతల వల్ల జరిగిన ప్రమాదాల కారణంగా 11,000 మందికి పైగా మరణించారు. ఈ సమస్యలు కొనసాగుతున్నప్పటికీ, రోడ్లు మరియు ప్రయాణికులకు ఉపశమనం కలిగించే ఒకే విధమైన దీర్ఘకాలిక పరిష్కారం లేదు.

logo

తెలుపు  టాపింగ్ కాంక్రీటు పరిచయం

ఈ క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి మరియు నగర రహదారులను సురక్షితంగా మరియు గుంతలు లేకుండా చేయడానికి అల్ట్రాటెక్ తెలుపు టాపింగ్ను అభివృద్ధి చేసింది. క్లుప్తంగా చెప్పాలంటేతెలుపు టాపింగ్ అంటే (దొంతరగా), ఇది ఇప్పటికే ఉన్న బిటుమినస్ రహదారి పైన పోర్ట్ ల్యాండ్ సిమెంట్ కాంక్రీట్ (పిసిసి) పోత పోయబడి నిర్మించబడింది. ఈ రహదారులు దీర్ఘకాలిక ప్రత్యామ్నాయంగా పనిచేస్తాయి


మరిన్ని ప్రయోజనాలు

  • శిధిలమవడం, నిర్మాణపు పగుళ్లు మరియు గుంతలను నిరోధిస్తుంది, ఇది సురక్షితమైన మరియు వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది.
  • ఇప్పటికే ఉన్న బిటుమెన్ పేవ్‌మెంట్ల నిర్మాణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
  • ప్రారంభ బడ్జెట్ బిటుమెన్ రోడ్ల కంటే కొంచెం ఎక్కువే కాని జీవిత కాల నిర్వహణ ఖర్చు బిటుమెన్ ,కాంక్రీట్ రోడ్ల కంటే చాలా తక్కువ.
  • కేవలం 14 రోజులలో నిర్మాణం పూర్తి అవుతుంది .ఇది కాంక్రీట్ రోడ్ల నిర్మాణం పూర్తి అయ్యే సమయం కంటే చాలా వేగంగా అవుతుంది.
  • కాంతి ప్రతిబింబం పెంచడం ద్వారా రాత్రి సమయంలో బాగా కనిపించడంతో ప్రయాణికుల భద్రతను మెరుగుపరుస్తుంది. ఇది రహదారి యొక్క విద్యుత్ వాడక భారాన్ని తగ్గిస్తుంది, తద్వారా విద్యుత్ శక్తిని ఆదా చేస్తుంది (20-30%).
  • పేవ్మెంట్ విక్షేపం (వంపు) తగ్గిస్తుంది, ఫలితంగా తక్కువ వాహన ఇంధన వినియోగం (10-15%) మరియు తద్వారా ఇంధన కాలుష్యం తగ్గుతుంది.
  • వాహన బ్రేకింగ్ దూరాన్ని తగ్గిస్తుంది, పొడి మరియు తడి ఉపరితల పరిస్థితులలో ఇది సురక్షితంగా ఉంటుంది.
  • తక్కువ వేడిని గ్రహించడం ద్వారా పట్టణాల్లో వేడి ప్రభావాన్ని తగ్గిస్తుంది, తద్వారా పట్టణ భవనాలలో ఎయిర్ కండిషనింగ్ కోసం విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తుంది.
  • తెలుపు టాప్‌డ్ పేవ్‌మెంట్ 100% పునర్వినియోగపరచదగినది, వాటి వినియోగకాలం చివరలో చూర్ణం చేసి తిరిగి ఉపయోగించవచ్చు.

 

coin


నిర్మాణ దశలు

1. మిల్లింగ్ & ప్రొఫైల్ దిద్దుబాటు

 

2. ఉపరితల తయారీ

 

3. కాంక్రీట్ ఓవర్లే

 

4. ఉపరితలం ఫినిషింగ్ఆ

 

5. ఆకృతి

 

6. గాడి చేయుట

 

7. క్యూరింగ్ & పరీక్షించడం

 

8. కర్బ్ లేయింగ్ & లేన్ మార్కింగ్సంప్రదింపు వివరాలు

మరింత సమాచారం కోసం, దయచేసి మా టోల్ ఫ్రీ నంబర్ 1800 210 3311 కు కాల్ చేయండి లేదా మీ సమీప అల్ట్రాటెక్ బిల్డింగ్ సొల్యూషన్స్ (యుబిఎస్) కేంద్రానికి చేరుకోండి.
Loading....