కాంక్రీట్ స్లంప్ టెస్ట్ చేసే విధానం
ఈ కాంక్రీట్ స్లంప్ కోన్ టెస్ట్ ద్వారా మిశ్రమం సరిగ్గా ఉందో లేదో తెలుస్తుంది. ఈ స్లంప్ టెస్ట్ చేసే పద్ధతిలో ఈ క్రింది దశలు ఉంటాయి:
1. అచ్చును సిద్ధం చేయడం (ప్రిపేర్ ద మోల్డ్) ప్రమాణాలకు అనుగుణంగా ఉండే స్లంప్ కోన్‌ను శుభ్రం చేసి, ఒక చదునైన ఉపరితలంపై ఉంచి గట్టిగా పట్టుకోవాలి.
2. కోన్‌ను నింపడం (ఫిల్ ద కోన్) అచ్చులో కాంక్రీట్‌ను మూడు పొరలుగా నింపాలి. ప్రతి పొరను టాంపింగ్ రాడ్‌తో 25 సార్లు గుచ్చి గట్టిపరచాలి.
3. కోన్‌ను లేపడం (లిఫ్ట్ ద కోన్) కాంక్రీట్ కదలకుండా అచ్చును నిలువుగా, జాగ్రత్తగా పైకి లేపాలి.
4. స్లంప్‌ను కొలవడం (మెజర్ ద స్లంప్) అచ్చు మరియు స్లంప్డ్ కాంక్రీట్ మధ్య ఎత్తు వ్యత్యాసం పని సౌలభ్యాన్ని సూచిస్తుంది.
ఇల్లు కట్టేటప్పుడు ఖచ్చితమైన స్లంప్ టెస్ట్ కోసం చిట్కాలు
ఇల్లు కట్టేవారు కాంక్రీట్ స్లంప్ టెస్ట్ గురించి తెలుసుకోవడం ద్వారా తమ నిర్మాణం యొక్క నాణ్యతను మరియు మన్నికను నిర్ధారించుకోవచ్చు. బలమైన మరియు నమ్మదగ్గ నిర్మాణం కోసం ఈ టెస్ట్ చాలా కీలకం.
తాజా కాంక్రీట్‌ను వాడండి (యూజ్ ఫ్రెష్ కాంక్రీట్) ఖచ్చితమైన ఫలితాల కోసం కాంక్రీట్ కలిపిన వెంటనే ఈ స్లంప్ టెస్ట్ నిర్వహించాలి
అధికంగా నొక్కడం మానుకోండి (అవాయిడ్ ఓవర్-టాంపింగ్) ప్రతి పొరను సమానంగా గట్టిపరచాలి, కానీ మరీ ఎక్కువగా చేయకూడదు.
- సరైన స్లంప్ స్థాయిని ఎంచుకోండి (చూజ్ ద రైట్ స్లంప్ లెవల్) తక్కువ స్లంప్ ఉంటే కాంక్రీట్ గట్టిగా ఉన్నట్లు, ఎక్కువ స్లంప్ ఉంటే కాంక్రీట్ సులభంగా ప్రవహిస్తున్నట్లు అర్థం. మీ పనికి తగ్గట్టుగా ఉండే స్లంప్ స్థాయిని ఎంచుకోండి.