ఎపోక్సీ ఫ్లోరింగ్ మన్నిక దేని మీద ఆధారపడి ఉంటుంది?
ఎపోక్సీ ఫ్లోర్ ఎంతకాలం మన్నుతుందో నిర్ణయించే కొన్ని విషయాలు:
1. ఉపరితలాన్ని సిద్ధం చేయడం: సరిగ్గా సిద్ధం చేయకపోవడం వల్ల త్వరగా ఊడిపోవడానికి లేదా పగుళ్లు రావడానికి దారి తీయవచ్చు.
2. మెటీరియల్స్ క్వాలిటీ: హై-గ్రేడ్ ఎపోక్సీ రెసిన్‌లు ఎక్కువ కాలం మన్నడమే కాకుండా మెరుగైన పనితీరును అందిస్తాయి.
3. జనం మరియు వాహనాల రాకపోకలు: ఎక్కువగా ఉపయోగిస్తే త్వరగా అరిగిపోతుంది.
4. కెమికల్స్ ప్రభావం: పదే పదే కెమికల్స్ పడితే ఫ్లోర్ పాడవుతుంది.
5. వాతావరణం: తేమ, హ్యూమిడిటీ మరియు ఎండ వల్ల మన్నిక తగ్గే అవకాశం ఉంది.
6. మెయింటెనెన్స్: రెగ్యులర్ క్లీనింగ్ మరియు ఒలికిన వాటిని సకాలంలో శుభ్రం చేయడం ఫినిషింగ్ మెరుపును కాపాడటంలో సహాయపడుతుంది.
ఇంటి కోసం ఎపోక్సీ ఫ్లోర్ డిజైన్లు
ఈ మధ్య ఇళ్లకు ఎపోక్సీ ఫ్లోరింగ్ ఒక స్టైలిష్ ఆప్షన్‌గా మారింది. ఇది అందంతో పాటు ఉపయోగకరంగా కూడా ఉంటుంది.
ప్రసిద్ధ హోమ్ ఎపోక్సీ ఫ్లోర్ డిజైన్లు:
1. మెటాలిక్ ఎపోక్సీ: మెరిసే ఎఫెక్ట్‌లతో మార్బుల్ లాంటి రూపాన్ని ఇస్తుంది, ఇది లివింగ్ రూమ్‌లు, హాల్‌వేలు లేదా ఆధునిక వంటశాలలకు అనువైనది.
2. ఫ్లేక్ ఎపోక్సీ: టెక్స్చర్ ఉన్న, టెర్రాజో లాంటి రూపాన్ని ఇచ్చే రంగురంగుల చిప్స్‌ను కలిగి ఉంటుంది, ఇది గ్యారేజీలు, బేస్‌మెంట్లు లేదా యుటిలిటీ ఏరియాలకు సరిగ్గా సరిపోతుంది.
3. సాలిడ్ కలర్స్: మీ ఇంటీరియర్స్ కు నప్పేలా న్యూట్రల్ లేదా బోల్డ్ షేడ్స్‌లో క్లీన్ మరియు మినిమలిస్ట్ ఫినిషింగ్ లు.
4. 3D ఎపోక్సీ డిజైన్లు: ఇందులో సముద్రపు అలలు వంటి బొమ్మలను క్లియర్ ఎపోక్సీ కోట్ కింద ఉంచి నేల మీద 3Dలో చూడవచ్చు.
5. మ్యాట్ లేదా గ్లాసీ ఫినిష్: మీకు నచ్చిన విధంగా మెరిసేలా లేదా సున్నితమైన లుక్ ఉండేలా చూసుకోవచ్చు.