ఆర్‌సీసీ ఫూటింగ్‌ అంటే ఏమిటి?

ఆగస్టు 25, 2020

మీ ఇల్లు తప్పకుండా ఏళ్ళ తరబడి దృడంగా ఉండాలి ఎందుకంటే ఇది మీ భావి తరాలకు కూడా నిలయంగా ఉంటుంది. ఇలా దృఢంగా నిర్మించుకునేందుకు, దీనికి బలమైన పునాది అవసరం. పునాదిని గట్టిగా నిర్మించుకునేందుకు ఆర్‌సిసి ఫుట్టింగ్స్‌ ఉత్తమ మార్గం.

ఆర్‌సిసి ఫుట్టింగ్స్‌ అంటే ఏమిటి?

ఇవి రీయిన్‌ఫోర్స్‌డ్‌ సిమెంట్‌ కాంక్రీట్‌ (ఆర్‌సిసి) ఫుట్టింగ్స్‌. ఇంటి బరువు మొత్తాన్ని మోసే కాంక్రీట్‌ పునాదికి రీయిన్‌ఫోర్స్‌మెంట్‌గా పనిచేసే స్టీల్‌ బార్స్‌తో ఇవి తయారుచేయబడతాయి, ఫుట్టింగ్స్‌ ఈ బరువును గ్రౌండ్‌పై మోపి, మీ ఇంటి నిర్మాణంపై భారం తగ్గిస్తాయి. స్ట్రక్చర్‌కి కావలసిన వాటిపై ఆధారపడి, ఫుట్టింగ్స్ ట్రేప్‌జోయిడల్‌, బ్లాక్‌ లేదా స్టెప్‌ ఆకారంలో ఉండొచ్చు.

ఆర్‌సిసి ఫుట్టింగ్స్‌ని బిగించేందుకు తీసుకోవలసిన చర్యలు ఏమిటి?

  • ఫుట్టింగ్‌ని బిగించడానికి ముందు, ఇందు కోసం తవ్వబడిన గ్రౌండ్‌ని ర్యామ్‌ చేయండి. ఇది నేల యొక్క దృఢత్వాన్ని మరియు స్థిరత్వాన్ని పెంచుతుంది.
  • ఆ తరువాత, బెడ్‌ సృష్టిస్తూ 150 ఎంఎం కాంక్రీట్‌తో ఏరియాను కవర్‌ చేయండి. మీ ఫుట్టింగ్‌ కోసం ఇది మీకు సాదా ఉపరితలం ఇస్తుంది.
  • రీయిన్‌ఫోర్స్‌మెంట్‌ కేజ్‌ని బిగించేటప్పుడు, తప్పకుండా దాని ఎలైన్‌మెంట్‌ సరిగ్గా ఉండేలా చూడండి.
  • కాంక్రీట్‌కి బురద పొరను అప్లై చేసిన తరువాత సిమెంట్‌ బెడ్‌కి కాంక్రీట్‌ పోయండి. ఉపయోగించిన కాంక్రీట్‌ పరిమాణం పునాది సైజుపై ఆధారపడి ఉంటుంది, షట్టరింగ్‌ చేయడం మరిచిపోకండి.
  • అన్నిటికీ మించి, ఫుట్టింగ్‌ సెట్‌ అయితే క్యూరింగ్‌ చేయడం మరిచిపోకండి. సమగ్ర దృఢత్వంతో నిర్మించేందుకు ఇది అవసరం.

మీ ఇంటికి ఆర్‌సిసి ఫుట్టింగ్స్‌ సరైన విధానంలో బిగించబడ్డాయని నిర్థారించుకునేందుకు ఈ మార్గదర్శకాలు పాటించండి.


అందుబాటులో ఉండు

మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి

చెల్లుబాటు అయ్యే పేరును నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే నంబర్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే పిన్‌కోడ్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే కేటగిరీని ఎంచుకోండి
చెల్లుబాటు అయ్యే ఉప కేటగిరీని నమోదు చేయండి

ఈ ఫారమ్‌ను సమర్పించడం ద్వారా మిమ్మల్ని సంప్రదించడానికి మీరు అల్ట్రాటెక్ సిమెంట్‌కు అనుమతినిస్తున్నారు.

దయచేసి ముందుకు కొనసాగించడానికి ఈ పెట్టెను ఎంచుకోండి