Stages of Building New Home Stages of Building New Home

వాటర్‌ఫ్రూఫింగ్ అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత, రకాలు & ఏమేం దశలు ఉంటాయి

మీ ఇల్లు మీకు మరియు మీ కుటుంబానికి ఆశ్రయం కంటే ఎక్కువ. ఇది మీకు సురక్షితమైన స్వర్గం. ఇది మీకు సౌకర్యం కలిగిస్తుంది మరియు ఎలిమెంట్స్ నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. అందుకే, తరతరాలుగా ఉండే ఇంటిని నిర్మించేందుకు మీరు డబ్బు, సమయం మరియు శక్తిని వినియోగిస్తారు.

మీరు ఎంతో శ్రద్ధతో మరియు జాగ్రత్తగా నిర్మించే మీ ఇల్లు, చెమ్మ లేదా స్లాబ్ లీక్ల వల్ల దెబ్బతినకూడదు. ఎందుకంటే ఇది మీ ఇంటి మన్నికను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది మరియు దాని దృఢత్వం విషయంలో రాజీపడేలా చేస్తుంది కాబట్టి,
చెమ్మ ఎందుకు కలుగుతుంది?
చెమ్మ ఎందుకు కలుగుతుంది?

Tచెమ్మ ఏర్పడటానికి ఒక్క కారణం ఉండదు, ముందుజాగ్రత్తల్లో ఏఒక్కటి తగ్గినా ఇది దీనికి దారితీయొచ్చు. మీ ఇంటి దృఢత్వాన్ని తీవ్రంగా రాజీపడేలా చేయవచ్చు. చెమ్మకు గల కొన్ని ప్రధాన కారణాలు ఇవి:

1
వెంటిలేషన్‌ తక్కువగా ఉండటం
2
గదుల్లో తగినంత వేడి లేకపోవడం
3
గోడలకు ఇన్సులేషన్‌ తక్కువగా ఉండటం
4
తడి వస్త్రాలు, మొక్కలు, కుకింగ్‌
మరియు బాత్‌రూమ్‌లు లాంటి నీటి వనరులు
5
వర్షపు నీరు చొరబాటు
పగిలిన గోడలు, లీక్‌ అవుతున్న రూఫ్‌లు మరియు కిటికిల ద్వారా
6
గోడలు మరియు ఫ్లోర్‌లద్వారా నీరు నానిపోవడం
పెరుగుతున్న చెమ్మ అని కూడా పిలుస్తారు.
 
స్లాబ్‌ లీక్‌లు అంటే ఏమిటి?

తగినంత ఏటవాలు లేకపోవడంలేదా వర్షపు నీటి పైపులు పూడుకుపోవడం వల్ల రూఫ్ స్లాబ్పై వర్షపు నీరు జమయినప్పుడు స్లాబ్ లీక్లు కలుగుతుంటాయి. కాంక్రీట్ నాణ్యత తక్కువగా ఉండటం ఈ సమస్యను మరింతగా పెంచుతుంది. కొంత కాలంలో, ఈ నిలిచివున్న నీరు కాంక్రీట్లోకి చొచ్చుకుపోయి స్టీలు లోపల తుప్పు కలిగిస్తుంది, దీనివల్ల లోపల చెమ్మ ఏర్పడుతుంది. ఫలితంగా, ఇది కాంక్రీట్ డిజ్ఇంటిగ్రేషన్కి దారితీస్తుంది. ఈ సమస్యను నివారించేందుకు, స్లాబ్ క్యాస్టింగ్ సమయంలో అత్యంత జాగ్రత్త తీసుకోవాలి మరియు వర్షపు నీటి పైపుల గుండా నీరు సరిగ్గా ప్రవహించేలా చేసేందుకు తగినంత ఏటవాలు ఉంచాలి. స్లాబ్ లీక్లు ఏ ఇంట్లోనైనా కలగవచ్చు, అందుకే మీ ఇంటిని నీటి నిరోధకంగా చేయడం చాలా ముఖ్యం.

వాటర్‌ప్రూఫింగ్‌ అంటే ఏమిటి
మరియు ఇది ఎందుకు ముఖ్యం?
వాటర్‌ప్రూఫింగ్‌ అంటే ఏమిటి
మరియు ఇది ఎందుకు ముఖ్యం?

వాటర్ప్రూఫింగ్ అనేది దీర్ఘ కాలంలో నీటి ఊట నుంచి మీ ఇంటిని రక్షించేందుకు అత్యుత్తమ పరిష్కారం. గోడలు, రూఫ్, ఫ్లోర్లు, తదితర వాటి గుండా నీరు మరియు తేమ ఊటను నిరోధించే వాటర్ప్రూఫింగ్ మెటీరియల్స్తో కాంక్రీట్కి కోటింగ్ వేయడం వాటర్ప్రూఫింగ్లో ఉంటుంది. వాటర్ప్రూఫింగ్ ఎందుకు ముఖ్యమో అర్థంచేసుకోవాలంటే, నీటి ఊట నిజంగా ఎందుకు అవాంఛనీయమనే విషయం చూద్దాం.

నీటి ఊట అనేది కాస్మొటిక్ సమస్య మాత్రమే కాదు. చికిత్స చేయకుండా వదిలేస్తే, ఇది గోడలపై బూజు కలిగించవచ్చు, ఇదిమీ కుటుంబ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు.
ఇంకా, నీరు ఎలక్ట్రికల్ వైర్లకు చేరుకుంటే, ఇది షార్ట్ సర్క్యూట్స్ మరియు అగ్ని ప్రమాదాలు కలిగించవచ్చు. మీ వ్యక్తిగత వస్తువులు మరియు విలువైన వస్తువుల్లోకి కూడా తేమ పోవచ్చు.
తీవ్రమైన పరిస్థితుల్లో, గోడల్లో రాటింగ్, లేదా ఫౌండేషన్ కుంగడం లాంటి ప్రమాదకరమైన స్ట్రక్చరల్ డేమేజ్ కూడా నీటి ఊట కలిగించవచ్చు. డేమేజ్కి మరమ్మతులు చేయడం విసుకుగా మరియు ఖరీదైన వ్యవహారంగా ఉంటుంది.
 

అందుకే ఆరంభం నుంచే నీటి ఊట నుంచి మీ ఇంటిని
రక్షించడం ఉత్తమంగా ఉంటుంది

వాటర్‌ప్రూఫింగ్‌ ఎక్కడ చేయాలి?
వాటర్‌ప్రూఫింగ్‌ ఎక్కడ చేయాలి?

ఫ్లడ్డింగ్కి గురయ్యే లేదా తరచుగా నీటితో కాంటాక్టు అయ్యే మీ ఇంట్లోని ఏరియాలకు కాంక్రీట్ వాటర్ప్రూఫింగ్ కీలకం. వీటిల్లో బాత్రూమ్లు మరియు కిచెన్లు లేదా రూఫ్, బాల్కనీ, బాహ్య గోడలు, బేస్మెంట్, మరియు నీటిని నిల్వచేసే ఏరియాలు లాంటి వాతావరణానికి బహిర్గతమయ్యే ఏరియాలు ఉంటాయి.

వాటర్‌ప్రూఫింగ్‌ పరిష్కారాల రకాలు

నేడు అనేక రకాల వాటర్ప్రూఫింగ్ పరిష్కారాలు లభిస్తున్నాయి. మీ ఇంటికి ఉత్తమ పరిష్కారం కనుగొనేందుకు మీ వాటర్ప్రూఫింగ్ కాంట్రాక్టరుతో మాట్లాడటానికి ప్రయత్నించండి. ఒక జనాదరణ పొందిన పరిష్కారం అల్ట్రాటెక్ సీల్ అండ్ డ్రై- మీ ఇంట్లోని విభిన్న ఏరియాలకు ప్రత్యేకంగా రూపొందించిన వాటర్ప్రూఫింగ్ ఏజెంట్ల రేంజి. ప్లాస్టర్ మోర్టార్ మరియు కాంక్రీట్ యొక్క మరియు తద్వారా మీ ఇంటి యొక్క నీటి నిరోధక గుణాలను మెరుగుపరిచేందుకు ఇవి రూపొందించబడ్డాయి. మీ భవనంలో చెమ్మను నిరోధించేందుకు గల కొన్ని మార్గాలను చూద్దాం:

1
మెంబ్రేన్‌ డ్యాంప్‌ ప్రూఫింగ్‌
ఇది డ్యాంప్ప్రూఫ్ కోర్సు ఇస్తుంది మరియు ఖరీదుకాని ఆప్షన్. పైగా దీనిని అప్లై చేయడం నిజంగా సులభం.
2
ఉపరితలం చికిత్స
నీటి వికర్షక మెటీరియల్స్తో బాహ్య ఉపరితలాలకు చికిత్స చేయడానికి ఈ సొల్యూషన్కి హక్కు ఉంటుంది.
3
క్యావిటి వాల్‌ నిర్మాణం
అంటే మీ ఇంట్లోకి నీటి ఊటను నిరోధించేందుకు మీరు క్యావిటీని సృష్టిస్తుందని అర్థం. బయట అదనంగా గోడ నిర్మించడం ద్వారా ఇది చేయబడుతుంది.

వాటర్ప్రూఫింగ్ ప్రక్రియలో
ప్రమేయం ఉన్న చర్యలు

1
మీరు మీ వాటర్ప్రూఫింగ్ ఏజెంట్ని ఎంచుకుంటే, మీ ఇంటి గోడలను నునుపుగా చేసేందుకు గ్రైడింగ్ చేయబడుతుంది.
2
నీటి నిరోధక బ్యారియర్లో ఖాళీలు లేకుండా చూసేందుకు కాంక్రీట్ ప్యాచ్లతో పగుళ్ళు వేటినైనా నింపాలి.
3
గోడలను క్షుణ్ణంగా శుభ్రం చేయాలి, దీనివల్ల వాటర్ప్రూఫింగ్ ఏజెంట్ కాంక్రీట్తో బాగా అతుక్కుంటుంది.
4
గోడలపై వాటర్ప్రూఫింగ్ కోట్ని అప్లై చేయాలి.

వాటర్ప్రూఫింగ్ యొక్క ప్రయోజనాలు ఏమిటి?

గోడల్లో తుప్పు మరియు కోసుకుపోవడాన్ని నిరోధించడం ద్వారా మీ స్ట్రక్చర్ మన్నికను వాటర్ప్రూఫింగ్ పెంచుతుంది. ఇది ఫంగస్ వృద్ధిని కూడా నిరోధిస్తుంది, ఇది ఎలర్జీలను లేదా ఆస్తమా ప్రేరేపకాలను నివారించేందుకు ఇది సహాయపడుతుంది. నీటి డేమేజ్కి విస్త్రుతంగా మరమ్మతులు చేయడానికి అయ్యే ఖర్చును ఇది ఆదా చేస్తుంది, మీ ఆస్తి విలువను నిలబెట్టుకోవడానికి సహాయపడవచ్చు.

ఇంటి నిర్మాణంపై ఇలాంటి మరిన్ని సూచనల కోసం, అల్ట్రాటెక్ సిమెంట్ వారి #బాత్ ఘర్ కి ని ట్యూన్ చేయండి.

అందుబాటులో ఉండు

మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి

చెల్లుబాటు అయ్యే పేరును నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే నంబర్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే పిన్‌కోడ్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే కేటగిరీని ఎంచుకోండి
చెల్లుబాటు అయ్యే ఉప కేటగిరీని నమోదు చేయండి

ఈ ఫారమ్‌ను సమర్పించడం ద్వారా మిమ్మల్ని సంప్రదించడానికి మీరు అల్ట్రాటెక్ సిమెంట్‌కు అనుమతినిస్తున్నారు.

దయచేసి ముందుకు కొనసాగించడానికి ఈ పెట్టెను ఎంచుకోండి