చెదలు-నిరోధక చికిత్సకు

అత్యుత్తమ ప్రక్రియ ఏమిటి?

జనవరి 01, 1970

మీ ఇంట్లోని చెక్క నిర్మాణాలకు చెదలు సోకకుండా సురక్షితంగా ఉంచేందుకు చెదలు-నిరోధక చికిత్స చేయాలి.

చెదలు-నిరోధక చికిత్స చేసేటప్పుడు, ఇంటి కింద మట్టికి మరియు ఫౌండేషన్‌ చుట్టూ ఉన్న మట్టికి చెదలు-నిరోధక రసాయనం లేదా కీటకనాశినితో చికిత్స చేస్తారు. ఇలా చేయడం వల్ల అప్పుడు చెదలు గుంపులు నిర్మూలించబడతాయి మరియు ఆ తరువాత అవి గుంపులుగా ఏర్పడకుండా కూడా నిరోధిస్తుంది. మీ ఇంటి నిర్మాణంలో చెదలు-నియంత్రణ ఎందుకు అత్యావశ్యం మరియు దీనిని ఎలా చేయాలి అనే విషయం చూద్దాం.

చెదలు-నియంత్రణ ఎందుకు ముఖ్యం:

చెక్క నిర్మాణాలకు చెదలు బెడద ఉంటుంది. ఇవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తే మీ ఫర్నిచర్‌, ఫిక్సర్‌లు మరియు ఇతర భాగాలకు తీవ్ర నష్టం కలుగజేస్తాయి. నిర్మాణానికి ముందు చెదలు-నియంత్రణ చేయకపోతే, ఇవి మీ ఇంటి కింద గుంపుగా ఏర్పడతాయి, కొన్నేళ్ళకు ఇవి మీ ఇంటికి తీవ్ర డేమేజ్‌ కలిగించగలవు.

ఐసిఐ స్పెసిఫికేషన్‌ల కింద బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌ సిఫారసు చేసిన ఒక జత చెదలు-నియంత్రణ రసాయనాలు ఉన్నాయి.

i)  క్లోపైరిఫాస్‌ 20% ఇసి

ii) ఇమిడాక్లోప్రిడ్‌ 30.5% ఎస్‌సి

నిర్మాణానికి ముందు మరియు నిర్మాణానికి తరువాత చెదలు-నిరోధక చికిత్స:

నిర్మాణానికి ముందు చెదలు-నిరోధక రసాయనాన్ని మట్టిలోకి, పునాదిలోకి మరియు పరిసర ప్రాంతాల్లోకి ఎక్కించడం ద్వారా చెదలు-నిరోధక చికిత్స చేస్తారు. నిర్మాణం పూర్తయిన తరువాత చెదలు-నిరోధక చికిత్స కోసం, గోడల పక్కలు మరియు అడుగు ప్రాంతాలకు చెదలునాశకంతో చికిత్స చేస్తారు. పరిసరాల్లో ఉన్న నేలను తప్పకుండా తవ్వి చికిత్స చేయాలి, ఇంటి వెంబడి చెదలు-నిరోధక బ్యారియర్‌ని ఏర్పాటు చేయాలి.

ప్రభావవంతమైన చెదలు-నిరోధక చికిత్సకు తీసుకోవలసిన చర్యలను ఇక్కడ ఇస్తున్నాము:

  తనిఖీచేయుట: చెదలు-నిరోధక రసాయనాలతో చికిత్స చేయవలసిన ఏరియాలను బాగా చెక్‌ చేసి గుర్తులు పెట్టాలి.

  స్థలాన్ని తయారుచేయుట: రసాయనాలను అప్లై చేయడానికి ముందు నిర్మాణ సైట్‌లో ఉన్న శిథిలాలను తొలగించాలి మరియు చికిత్స చేయవలసిన ప్రాంతంలో ఖాళీలు లేకుండా చూడాలి.

  అప్లికేషన్: నిర్దిష్ట ప్రాంతాలకు టెర్మిటిసైడ్ యొక్క సూచించిన మోతాదు రేటు ఉండేలా చూసుకోండి.

  ఎల్లప్పుడూ చెదలు-నిరోధక చికిత్సను నిపుణుడు పర్యవేక్షించేలా చూడండి. తాగు నీటి మూలాలకు సమీపంలో ఎక్కడా రసాయనాలను ఉపయోగించకుండా జాగ్రత్త తీసుకోవాలి.

 

చెదలు-నిరోధక చికిత్సను చేయించడం ఈ కింది కారణాల రీత్యా చాలా ముఖ్యం:

  ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది మరియు మీ ఇంటికి వెంటనే రక్షణ కల్పిస్తుంది.

  సంవత్సరాల తరబడి చెదలు నుంచి మీ ఇంటిని సురక్షితంగా ఉంచుతుంది.

  ద్రవ చెదలునాశినిలను సులభంగా భరించవచ్చు, మీ ఇల్లు ఎక్కువ కాలం మన్నికగా ఉండటానికి ముఖ్యమైన పెట్టుబడి.

మీ ఇంటికి చెదలు కలిగించిన డేమేజ్‌ని తిరిగి పూడ్చలేము. అయితే, కొద్దిపాటి ముందుచూపు మరియు ముందుజాగ్రత్త మీ ఇంటిని చెదలు నుంచి సురక్షితంగా ఉంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

 


అందుబాటులో ఉండు

మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి

చెల్లుబాటు అయ్యే పేరును నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే నంబర్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే పిన్‌కోడ్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే కేటగిరీని ఎంచుకోండి
చెల్లుబాటు అయ్యే ఉప కేటగిరీని నమోదు చేయండి

ఈ ఫారమ్‌ను సమర్పించడం ద్వారా మిమ్మల్ని సంప్రదించడానికి మీరు అల్ట్రాటెక్ సిమెంట్‌కు అనుమతినిస్తున్నారు.

దయచేసి ముందుకు కొనసాగించడానికి ఈ పెట్టెను ఎంచుకోండి