అందుబాటులో ఉండు

మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి

చెల్లుబాటు అయ్యే వర్గాన్ని ఎంచుకోండి

మీ ఉప-కేటగిరీని ఎంచుకోండి

acceptence

దయచేసి తదుపరి కొనసాగించడానికి ఈ పెట్టెను ఎంచుకోండి

hgfghj


మీ ఇంటికి కిటికీల్లో రకాలు

ఇళ్ళల్లో ఉపయోగించే వేర్వేరు రకాల కిటికీల గురించి తెలుసుకుని ఇంకా మీ ఇంటికి కిటికీని ఎంచుకునేటప్పుడు గుర్తుంచుకోవలసిన అన్ని విషయాలు తెలుసుకోండి.

Share:


ఒక ఇంటి అందాన్ని ఇంకా పనితనాన్ని మలచడంలో కిటికీలు విశిష్ట ప్రభావం చూపుతాయి. అవి వెంటిలేషన్ని అందించి, సహజ వెలుతురుని లోనికి రానిస్తాయి ఇంకా లోపలి మరియు బయటి ప్రాంతాల ఆకర్షణని పెంచుతాయి. అదే మీరు ఆలోచిస్తూ ఉంటే మీరు ఎంచుకో దగిన వేర్వేరు రకాల కిటికీలు ఇంకా అవి మీ ఇంటి డిజైన్లో ఎలా ఉపయోగించుకోవచ్చో, మీరు సరైన చోటికి వచ్చారు. మేం ఇక్కడ ఉన్నది మీ ఇంటికి ఒక అద్భుతమైన రూపు ఇవ్వడానికి కిటికీ రకంలో మీరు సరైన నిర్ణయం తీస్కోవడంలో మీకు సాయం చెయ్యడానికి.


మీ ఇంటికి వేర్వేరు రకాల కిటికీలు

చూడచక్కని భూతలాలని ఫ్రేమ్ చేసే ఫిక్స్ చేయబడ్డ కిటికీలనుంచి గాలులని సులువుగా రానిచ్చే స్లైడింగ్ కిటికీల దాకా వేర్వేరు నిర్మాణ స్టైల్స్ ఇంకా ఇంటి యజమాని మెప్పుదలకి తగినట్టి విస్త్రుత రకాల కిటికీల ఎంపికలు ఉన్నాయి. సరైన కిటికీలు ఒక ఇంటి అందమైన రూపుని పెంచుతూ దాని సౌకర్యం ఇంకా శక్తి సామర్ధ్యాన్ని కూడా పెంచుతాయి. పారంపరిక పరిష్కారాలనుంచి ఆధునిక ప్రత్యామ్నాయల దాకా మనం ప్రతీ రకంది సాధ్యతలు ఇంకా లాభాలని పరిశీలిద్దాం.


1. ఫిక్స్డ్ కిటికీలు

బిగించబడ్డ కిటికీలు కదలకుండా ఉంటాయి ఇంకా తెరిచి మూసేందుకు లేకుండా డిజైన్ చేయబడ్డాయి. అవి సాధారణంగా అందమైన సీనుల్ని బంధించడానికి, ఒక గదిలోకి సరిపడా సహజ వెలుతురు రానివ్వడానికి ఇంకా ఒక బాహ్య అనుభూతిని స్రుష్టించడానికి ఉపయోగించబడతాయి. కనుక, మీ ఇంటి చుట్టు పక్కల గొప్ప ద్రుశ్యాలుంటే లేదా మీరు ఏదైనా విసిగించే శబ్దాన్ని నిరోధించాలంటే లేదా వాసన అయినా మీ ఇంటి అందచందాలని నిలిపి ఉంచుకోవాలనుకుంటే అపుడు ఫిక్స్డ్ కిటికీ అతి మెరుగైన కిటికీ రకం.



2. స్లైడింగ్ కిటికీలు

స్లైడింగ్ కిటికీలు ఒక గాడి గుండా సమాంతరంగా పనిచేస్తాయి ఇంకా పాక్షికంగా లేదా పూర్తిగా తెరవ్వచ్చు. ఇవి వాటి సాదాతనం, సులువైన వాడకం ఇంకా అద్భుతమైన వెంటిలేషన్ సామర్ధ్యాలకి ప్రసిద్ధి. వెడల్పైన ద్రుక్కోణాలు ఇంకా గాలి వాతావరణాలున్న ఒక ఇంటికి ఈ కిటికీ రకం సరిగ్గా సరైనది.

 

3. పైవట్ (కీలు) కిటికీలు

ఈ రకమైన కిటికీలని పైనుంచి లేదా కిందనుంచి తెరవ్వచ్చు అవి కదులుతాయి కనుక, అంటే అవి మధ్య భాగం చుట్టూ తిరుగుతాయి. ఈ ప్రత్యేకమైన ఇంకా ఆవిష్కారక ఫీచర్ మీ ఇంటికి ఒక రకమైన ఉన్నతత్వాన్ని అందిస్తూ వెసులుబాటున్న గాలి మానేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ రకమైన కిటికీ చిన్న ప్రదేశాలకి ఇంకా ఆధునికీకరించిన ఇళ్ళకు మెరుగ్గా సరిపడుతుంది.

 

4. సింగిల్-హంగ్ కిటికీలు

4. సింగిల్-హంగ్ కిటికీలలో రెండు సాషెస్ ఉంటాయి ఇందులో ఒకటే సాష్/పలక కదులుతుంది. ఈ రకమైన కిటికీలు బడ్జెట్ హితం ఇంకా మెయింటెయిన్ చెయ్యడానికి సులువుగా ఉంటాయి. ఇవి చాలా వేర్వేరు రకాల గదులకి ఇంకా డిజైన్లకి అనువైనవి.

 

5. లౌవర్డ్ (లోపలి పొగ బయటకి, బయటి గాలి లోపలికి వచ్చే) కిటికీలు

లౌవర్డ్ కిటికీలలో ఎన్నో సమాంతర పలకలు ఉంటాయి, మీ ప్రాముఖ్యత ప్రైవెసీ, గాలి ప్రసరణ ఇంకా సహజ వెలుతురైతే ఇవి సరైన ఎంపిక. ఇవి బాత్రూములు ఇంకా లాండ్రీ గదుల వంటి వాడకం గదులకి సరైనవి. 

 

6. కేస్మెంట్ కిటికీలు

 కేస్మెంట్ కిటికీలు ఇళ్ళల్లో కనబడే అత్యంత సాధారణ రకమైన కిటికీలు. ఈ కిటికీలకి కీళ్ళు ఉండి వాటిని ఫ్రేము లేదా సెట్టింగుకి కనెక్ట్ చేస్తాయి ఇంకా బయటకి తెరుచుకుంటాయి. ఈ కిటికీలు అద్భుతమైన వెంటిలేషన్ ఇస్తాయి, కొనలకి ప్రతిగా టైట్ సీల్ ఇచ్చి ఒక అందమైన సమతుల్య రూపురేఖలనిచ్చే సామర్ధ్యం కలిగి ఉంటాయి.

 

7. లోహపు కిటికీలు

మెటల్ కిటికీలు వాటి ధ్రుఢత్వం ఇంకా మన్నిక కారణంగా ఆధునిక ఇంకా పారిశ్రామిక స్టైలున్న ఇళ్లకి సాధారణ ఎంపిక. వివిధ నిర్మాణ స్టైల్స్ అవసరాలకి అనుగుణంగా వీటిని వైవిధ్య సైజులు ఇంకా ఆకారాలలో తయారు చెయ్యచ్చు.

 

8. డబుల్-హంగ్ కిటికీలు

డబుల్-హంగ్ కిటికీలలో రెండు కదిలే పలకలుండి నిలువుగా తెరవబడతాయి. ఇవి వెసులుబాటున్న వెంటిలేషన్ ఆప్షన్లు, సరళ శుభ్రపరిచే ప్రక్రియలు ఇంకా పారంపరిక మరియు ఆధునిక ఆవాసాలకి సరిపడేలా అందిస్తాయి.

 

9. మూల కిటికీలు

మూల కిటికీలు ప్రత్యేకంగా ఒక భవన మూలలకి విస్తరించేలా స్రుష్టించబడతాయి. దాంతో సహజ వెలుతురుని అత్యధికంగా చేస్తూ, అందమైన ద్రుశ్యాలని అందిస్తాయి. ఇవి గదికి ఒక విలక్షణమైన నిర్మాణ శోభని ఇంకా ఆ స్థలానికి ఒక బాహ్య అనుభూతిని అందిస్తాయి. 

 

10. బే కిటికీలు

బే కిటికీలు భవన ప్రధాన గోడలనుంచి బయటని కనబడేలా చేసి, ఒక చిన్న ఆర్చిని స్రుష్టించే కిటికీ రకం. ఇవి నేల స్థలాన్ని పెంచి, బోలెడంత సహజ గాలిని లోనికి రానిచ్చి, ఒక సౌకర్యవంతమైన ఇంకా చక్కటి కూర్చునే ప్రాంతంతో అమర్చుకోవచ్చు. 

 

11. పొడుచుకొచ్చే కిటికీలు

డార్మర్ కిటికీలు చిన్నవి ఇంకా ఏటవలుగా ఉండే పైకప్పులోంచి పొడుచుకు వచ్చే కిటికీల రకం. ఇవి అటక స్థలాలలోకి సహజ వెలుతురుని తెస్తాయి, నిర్మాణ లక్షణాన్ని పెంపొందిస్తాయి ఇంకా అటక మార్పిడులతో వెంటిలేషన్ అందిస్తాయి.

 

12. సెలెరెస్టరీ కిటికీలు

ఈ రకమైన కిటికీలు ఇళ్ళకి సరిగ్గా పైకప్పు కింద ఎత్తైన గోడల పైన కట్టినవి ఇవి సహజ వెంటిలేషన్ ఇంకా వెలుతురుని లోపలికి మ్రుదువుగా రానిస్తాయి. మీరు మీ స్థలంలో ప్రైవెసీని, పెరిగిన శక్తి సామర్ధ్యం ఇంకా డిజైనుకి నిర్మాణ కేద్రీక్రుత పాయింట్ కోసం చూస్తుంటే ఈ కిటికీలు అనువైన ఎంపిక.



13. పైకప్పు లాంతరు కిటికీలు

పైకప్పుపై పెట్తబడిన అతి పెద్ద, గాజు కట్టడాలని పైకప్పు లాంతరు కిటికీలు అంటారు. ఈ కిటికీల డిజైన్ లోపలికి సహజ వెలుతురుని తేవడానికి చేయబడింది. ఈ ఇంటి కిటికీ రకాలు స్థలపు అందమైన రూపురేఖలని అందించి ఇంకా ఒక ఘనమైన స్పర్శని కలిగిస్తూ స్థలానికి నాటకీయ ప్రభావాన్ని కలిగిస్తాయి.

 

14. గేబుల్ కిటికీలు

గేబుల్ కిటికీలు పైకప్పు త్రికోణ అంచులలో పెట్టబడిన త్రికోణాకారపు కిటికీలు. ఇవి ఇంటి బాహ్య అందాన్ని పెంపొందించడమే కాక అటక లేదా చిన్న అటక స్థలాలకి అదనపు కాంతి ఇంకా వెంటిలేషన్ అందిస్తాయి.

 

15. వెంటిలేటర్ కిటికీలు

వెంటిలేటర్లు ఇంటి లోపల ఉపాయంతో ప్లాన్ చేసి పెట్టబడే చిన్న కిటికీలు దాంతో గాలి ప్రసరణ ప్రోత్సహించబడి ఒక భవనపు వెంటిలేషన్ అమరికని సరిగ్గా పని చేసేలా చేసేవి. తరచుగా ఇతర కీటికీల రకాలతో ఉపయోగించబడే వెంటిలేటర్లు గాలి ప్రసరణని మెరుగుపరచి ఇంకా ఒక శుభ్రమైన. తాజా మరియు చక్కటి లోపలి వాతావరణాన్ని ఇస్తాయి. వెంటిలేటర్లు డిజైన్లో సరిపడి ఇంకా మీ ఇంట్లో తగిన విధంగా అమర్చేటట్లు చూడటం ముఖ్యంగా మీ కాంట్రాక్టరు పని.



16. స్కైలైట్స్ కిటికీలు

 స్కైలైట్స్ కిటికీలు సీలింగు లేదా పైకప్పులో పెట్టబడ్డ కిటికీలు ఇంకా పైనుంచి సహజ కాంతి పుంజాన్ని వచ్చేలా చేసేవి. లెక్కలేనంత సహజ కాంతిని ఇచ్చి క్రుత్రిమ లైటింగ్ అవసరాన్ని తగ్గిస్తూ, ఇవి బయట లోకంతో ఒక ఓపెన్ అనుభూతిని ఇంకా బంధాన్ని అందిస్తాయి. ఈ రకమైన కిటికీలని ఫిక్స్ చేయచ్చు లేదా కదిలేవిగా ఉంచచ్చు ఇంకా విస్త్రుత సైజులు మరియు షేపుల్లో వస్తాయి.

 

 

మీ ఇంటికి అత్యంత మెరుగైన కిటికీని ఎంచుకోడానికి చిట్కాలు

 

1. మీ ఇంటి నిర్మాణ స్టైలుని పరిగణనలోకి తీస్కోండి 

వేర్వేరు రకాల కిటికీలని చూస్తున్నపుడు మీ ఇంటి డిజైన్ మీ ప్రధమ పరిగణన కావాలి. పారంపరిక, సమకాలిక ఇంకా వలస రాజ్య నిర్మాణ స్టైల్స్ అన్నిటికీ వాటి ఆమూల ద్రుగ్గోచరాన్ని పెంపొందించే కిటికీ ప్యాటర్నులు ఉన్నాయి. మీ ఇంటి నిర్మాణ అంశాలని మెరుగుపరిచే కిటికీ డిజైన్లని కనుగొనడానికి కొంత పరిశోధన చేసి నిపుణులతో మాట్లాడండి.

 

2. మీ ప్రైవెసీ ఇంకా సహజ కాంతి అవసరాలని మదింపు చేస్కోండి

ఒక ఇంటి కిటికీ రకాన్ని ఎంచుకునేటప్పుడు ప్రైవసీ ఇంకా సహజ కాంతి ప్రముఖ అంశాలు. ప్రతీ గదిలోనూ మీకెంత ప్రైవసీ కావాలో నిర్ణయించుకుని కావలసిన ప్రైవసీని అందించే కిటికీ డిజైన్లని పరిగణించండి. మీ ఇంటి ప్రాగ్దిశని ఇంకా ప్రతి గదిలోనూ ఎంత సూర్యకాంతి అందుతోందనేది చూస్కోండి. ఎంత వీలయితే అంత సూర్యకాంతిని రానిచ్చి అలాగే అధిక వేడి స్వీకరణని ఇంకా నష్టాన్ని తగ్గించే కిటికీలని ఎంచుకోండి. సహజ కాంతితో పాటు ఇంటి ఆమూల వెంటిలేషన్కి ఆ స్థలం తగినదని నిర్ధారించుకోండి.

 

3. శక్తి సామర్ధ్యాన్ని బేరీజు వెయ్యండి

శక్తి సామర్ధ్య కిటికీలు మీ వేడి చేస్కునే ఇంకా చల్లబరిచే ఖర్చులని గణనీయంగా తగ్గించగలవు, ఇది హరిత ఇంటి ప్లానింగులో ఒక ముఖ్యమైన అంశం. హరిత ఇంటి ప్లానింగ్ చిట్కాలు అవలంబించడం వాతావరణ తాకిడిని తగ్గించి నిలకడని ప్రసాదిస్తాయి. తక్కువ U-factor ఇంకా Solar Heat Gain Coefficient (SHGC) రేట్లు కల కిటికీల కోసం చూడండి. U-factor కిటికీ ఇన్సులేషన్ లక్షణాలని కొలుస్తుంది అలాగే SHGC అది ఎంత సౌర వేడిమిని అనుమతిస్తుంది అన్నది సూచిస్తుంది. శక్తి సామర్ధ్య కిటికీలకి తరచు డబుల్ లేదా ట్రిపుల్ గ్లేజింగ్ ఉంటుంది. లో-ఎమిసివిటీ (low-E) కోటింగ్స్ ఇంకా ఇన్సులేటింగ్ ఫ్రేములు ఉంటాయి. 

 

4. వాతావరణాన్ని పరిగణించండి

మీ ఇంటి ప్రాంతం ఇంకా వాతావరణం మీ కిటికీ ఎంపికని ప్రభావితం చెయ్యాలి. శీతల వాతావరణాలలో వేడి నష్టన్ని నివారించడానికి మంచి ఇన్సులేషన్ లక్షణాలు కల కిటికీలు అవసరం. ఇన్సులేట్ చేయబడ్డ ఫ్రేములు, అధిక గ్లేౙింగ్ పొరలు ఇంకా వెచ్చటి అంచు ఖాళీలు చేసే కిటికీల కోసం చూడండి. వెచ్చటి వాతావరణాలలో లో-ఇ కోటింగులు ఇంకా సౌర నియంత్రణ గ్లేౙింగ్ ఉన్న కిటికీలు వేడిమి పెరుగుదలని తగ్గించడంలో సాయపడతాయి. మీ ఇంటికి ఓ కిటికీని ఎంచుకునేటప్పుడు ఇంటి ఇన్సులేషన్ అనేది పరిగణించాల్సిన ఒక ముఖ్య అంశం. 

 

5. మెయింటెనెన్స్ అవసరాలని అంచనా వేయండి

వేర్వేరు కిటికీ పదార్ధాలకి మారే మెయింటెనెన్స్ అవసరాలు ఉంటాయి. చెక్క ఫ్రేములకి ఉదాహరణకి అవి పుచ్చిపోకుండా ఇంకా నాశనం కాకుండా ఉండడానికి నిరంతర పెయింటింగ్ లేదా సీలింగ్ అవసరమవుతుంది. వినైల్ లేదా ఫైబర్ గ్లాస్ ఫ్రేములు తక్కువ మెయింటెనెన్స్ ఎంపికలు, ఇవి కుళ్లవు ఇంకా పెయింటింగ్ అవసరం ఉండదు. కిటికీ పదార్ధాన్ని ఎంచుకునేటప్పుడు మీ జీవనశైలి ఇంకా కిటికీ మెయింటెనెన్సుకి మీరు వెచ్చించగల సమయం పరిగణించండి.

 

6. శబ్దం తగ్గింపుని అంచనా వేయండి

మీరు గోలగా ఉండే ప్రాంతంలో నివసిస్తే కనక, మంచి శబ్ద ఇన్సులేషన్ లక్షణాలున్న కిటికీలని పరిగణించండి. డబుల్ లేదా ట్రిపుల్ గ్లేజింగ్, లామినేటెడ్ అద్దం లేదా జడమైన గ్యాస్ నింపినవి బయటి శబ్దాన్ని గణనీయంగా తగ్గించగలవు, దాంతో ఒక నిశ్శబ్ద ఇంకా అధిక శాంతియుత లోపలి వాతావరణం నెలకొంటుంది. 

 

7. పరిశోధన వారంటీలు ఇంకా సర్టిఫికేషన్లు

మీరు ఎంచుకునే కిటికీలు లోపాలు కవరయ్యే కాంప్రహెన్సివ్ వారంటీతో వస్తాయని నిర్ధారించుకోండి అది దీర్ఘకాల మన్నికనిస్తుంది. ENERGY STAR వంటి సర్టిఫికేషన్లు ఉన్న కిటికీలకై చూడండి, అది సూచిస్తుంది ఆ ఉత్పాదనలు కఠినమైన శక్తి సామర్ధ్య ప్రామాణికతలకి సరిపోతాయని.



మీ ఇంటికి సరిగ్గా సరిపోయే కిటికీలని ఎంచుకునేటప్పుడు వేర్వేరు రకాల కిటికీలు ఇంకా వాటి లక్షణాలని బేరీజు వేయడం చాలా ముఖ్యం. మామూలు కేస్మెంట్ కిటికీలనుంచి సమకాలీన కీలు కిటికీల దాకా ప్రతి రకం కిటికీకి దాని సొంత ఆకర్షణ ఇంకా ప్రభావతత్వం ఉన్నాయి. నిర్మాణ స్టైల్, శక్తి సామర్ధ్యం, ప్రైవసీ అంశాలు ఇంకా మెయింటెనెన్స్ అవసరాలు పరిగణించి, మీరు మీ ఇంటి డిజైనుతో ఇబ్బంది లేకుండా కలిసిపోయే ఆదర్శ కిటికీలని ఎంచుకోవచ్చు అలాగే సౌకర్యం ఇంకా ఆదాని అందిస్తూ. మీ ఇంటిని ఆకర్షణీయంగా ఇంకా స్వాగతించే ఇంటిలా చేసే కిటికీ రకాన్ని ఎంచుకునే బాధ్యతని మీ లోపలి డిజైనరుకి ఇవ్వండి.

 

దీని గురించి ఇంకా నేర్చుకోవడానికి మీరు వివిధ రకాల తలుపు ఇంకా కిటికీ ఫ్రేములపి వీడియోని చూడచ్చు.



సంబంధిత కథనాలు




సిఫార్సు చేయబడిన వీడియోలు





గృహ నిర్మాణానికి ఉపకరణాలు


ఖర్చు కాలిక్యులేటర్

ప్రతి ఇంటిని నిర్మించేవారు తమ కలల ఇంటిని నిర్మించాలనుకుంటున్నారు, కాని అధిక బడ్జెట్‌కు వెళ్లకుండా అలా చేస్తారు. 

logo

emi కాలిక్యులేటర్

గృహ-రుణం తీసుకోవడం అనేది గృహనిర్మాణానికి ఆర్థిక మార్గంగా చెప్పవచ్చు, కాని గృహనిర్మాణదారులు వారు ఎంత EMI చెల్లించాలో తరచుగా అడుగుతారు.

logo

ప్రొడక్ట్ ప్రిడిక్టర్

ఇంటిని నిర్మించే ప్రారంభ దశల్లో గృహ నిర్మాణదారు సరైన ఉత్పత్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

logo

స్టోర్ కాలిక్యులేటర్

ఇంటి బిల్డర్ కోసం, ఇంటి భవనం గురించి విలువైన సమాచారాన్ని పొందగలిగే సరైన దుకాణాన్ని కనుగొనడం చాలా ముఖ్యం.

logo

Loading....