అందుబాటులో ఉండు

మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి

చెల్లుబాటు అయ్యే వర్గాన్ని ఎంచుకోండి

మీ ఉప-కేటగిరీని ఎంచుకోండి

acceptence

దయచేసి తదుపరి కొనసాగించడానికి ఈ పెట్టెను ఎంచుకోండి

hgfghj

ఎలివేషన్ ప్లాన్ అంటే ఏమిటి? వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి సమగ్ర గైడ్

నిర్మాణ ప్రపంచంలో, ఒక దృష్టిని రియాలిటీగా మార్చడం అనేది ప్రణాళిక, కొలతలు అమలును ఖచ్చితంగా చేయడం. ఏదైనా నిర్మాణ ప్రాజెక్టుకు వెన్నెముకగా ఉండే ప్రాథమిక అంశాలలో ఒకటి "ఎలివేషన్ ప్లాన్." ఈ ప్రణాళిక నిర్మాణం రూపకల్పన గురించి ఆర్కిటెక్ట్స్, బిల్డర్లు, ఇంజనీర్లకు బ్లూప్రింట్‌గా ఉపయోగపడే ఒక కీలకమైన డాక్యుమెంట్.

Share:


ఎలివేషన్ ప్లాన్ పూర్తి భవనం ఎలా ఉంటుందనే ఆలోచనను అందిస్తుంది. ఇది భవనం బయటి వైపుల విజువల్ రిప్రజెంటేషన్‌గా ఉంటుంది, అది స్ట్రక్చరల్, ఆర్కిటెక్చరల్ వివరాలను వివరిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ ప్లాన్లు భవనం లోపలి భాగాన్ని కూడా ఇలస్ట్రేట్ చేస్తాయి. ఒక ఫ్లోర్ ప్లాన్ లేదా సీలింగ్ ప్లాన్ భవనం లేఅవుట్‌ను ప్రదర్శించినట్లే, ఎలివేషన్ ప్లాన్ భవనం ఎత్తునీ, రూపాన్నీ ప్రదర్శిస్తుంది.

 

ఆర్కిటెక్ట్‌లు, బిల్డర్లు, క్లయింట్‌లు భవనం పూర్తయిన తర్వాత ఎలా ఉంటుందో విజువలైజ్ చేయడానికీ, అర్థం చేసుకోవడానికీ సహాయపడటం ద్వారా అవి కీలక పాత్ర పోషిస్తాయి. భవనం బయట లక్షణాలు, కొలతలు వర్ణించడం ద్వారా ఈ ప్లాన్స్ సులభమైన నిర్మాణం, మెయింటెనెన్స్ మార్పులలో సహాయపడతాయి. నిర్మాణం ప్రారంభించే ముందు ప్రాజెక్ట్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ డిజైన్‌తో సంతృప్తి చెందారని నిర్ధారించుకోవడం ద్వారా అవి సమయం, వనరులు డబ్బును కూడా ఆదా చేస్తాయి.

 

ఈ బ్లాగ్‌లో ఎలివేషన్ ప్లాన్ అంటే ఏమిటి, దాని ప్రాముఖ్యత, నిర్మాణ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేయడంలో అది విలువైన ఆస్తిగా ఎలా నిరూపించబడుతుందో మనం విశ్లేషిద్దాం.



ఎలివేషన్ డ్రాయింగ్‌లో ఏం పొందుపరచబడింది?



ఎలివేషన్ డ్రాయింగ్ ప్లాన్‌ను డిజైన్ చేయడానికి, ప్రధాన ద్వారం, కిటికీలు, సీలింగ్ ప్రాంతం, కొలతలు, లెజెండ్స్, స్కేల్ వంటి వివిధ అంశాలు చేర్చబడ్డాయి. ఈ ప్లాన్‌లు సాధారణంగా నాలుగు దిక్కుల్లోనూ కనిపించే వ్యూస్ కోసం తయారుచేయబడతాయి: ఉత్తరం, దక్షిణం, తూర్పు పడమర. ఎలివేషన్ ప్లాన్‌లో సాధారణంగా చేర్చబడిన ప్రధాన అంశాలు ఇక్కడ ఉన్నాయి:

 

1. నిర్మాణ వివరాలు

భవనం మొత్తం సౌందర్య ఆకర్షణకు దోహదపడే ముఖభాగం డిజైన్, బయట ముగింపులు, అలంకరణ అంశాలు ఇతర అలంకార లక్షణాల వంటి భవన నిర్మాణ లక్షణాలను ఈ ప్లాన్ ప్రదర్శిస్తుంది.

 

2. కొలతలు

ఖచ్చితమైన కొలతలు, డైమన్షన్లు ఈ ప్లాన్‌లో చేర్చబడతాయి. బిల్డర్లు ముఖభాగంలో ప్రతి అంశాన్నీ ఖచ్చితమైన సైజు, స్కేల్లో ఉండేలా నిర్ణయించడానికి వీలు కల్పిస్తుంది. నిర్మాణ సమయంలో ఈ సమాచారం కీలక పాత్ర పోషిస్తుంది.

 

3. స్కేల్

వాటిని స్కేల్‌ ప్రకారం గీయబడతాయి. ఆర్కిటెక్టులు, బిల్డర్లు, క్లయింట్లు భవనంలోని విభిన్న అంశాల సాపేక్ష పరిమాణాలు, దూరాలను అర్థం చేసుకోవడానికి వీలు కల్పిస్తాయి.

 

4. కిటికీలు, తలుపులు

కిటికీలు, తలుపుల ప్లేస్‌మెంట్, పరిమాణం శైలి ఎలివేషన్ ప్లాన్‌లో వర్ణించబడ్డాయి. ఈ ఓపెనింగ్‌లు మొత్తం డిజైన్‌కు ఎలా దోహదపడతాయో స్పష్టమైన ఆలోచన ఇస్తుంది.

 

5. సీలింగ్ డిజైన్

ప్లాన్‌లో రూఫ్ డిజైన్, దాని వాలు, స్టైల్ చిమ్నీలు లేదా స్కైలైట్‌ల వంటి ఏవైనా రూఫ్ ఫీచర్‌లను కూడా ప్రదర్శిస్తుంది. ఇది మొత్తం రూపాన్ని విజువలైజ్ చేయడంలో సహాయపడుతుంది, రూఫింగ్ విషయాల్ని సరిగ్గా అమలు చేసేలా చూస్తుంది.

 

6. నిలువు ఎలివేషన్స్

అంతస్తుల సంఖ్య, సీలింగ్ ఎత్తు, రూఫ్‌లైన్‌తో సహా ఎలివేషన్ డ్రాయింగ్ భవనం నిలువు కొలతలు, ఎత్తులను కూడా వివరిస్తుంది.

 

7. మెటీరియల్ సమాచారం

ప్లాన్ తరచుగా ఇటుక, రాయి, స్టక్కో లేదా సైడింగ్ వంటి బయట కోసం ఉపయోగించే మెటీరియల్‌ని ప్రత్యేకంగా చెప్తుంది. నిర్మాణ దశలో బిల్డర్లు, కాంట్రాక్టర్లు ఈ సమాచారం తెలుసుకున్న తర్వాత నిర్ణయాలు తీసుకోవడంలో ఇది సహాయపడుతుంది.

 

8. ల్యాండ్ స్కేపింగ్ మరియు బయటి ఫీచర్లు

కొన్ని సందర్భాల్లో ఈ ప్లాన్లు తోటలు, మార్గాలు, డ్రైవ్‌వేలు, భవనం మొత్తం అందానికి దోహదపడే ఇతర బాహ్య లక్షణాల వంటి ల్యాండ్‌స్కేపింగ్ అంశాలను కూడా కలిగి ఉంటాయి.


ఇంటిని నిర్మించేటప్పుడు ఎలివేషన్ ప్లాన్‌ల ప్రాముఖ్యత



ఎత్తును నిర్మించే విషయానికి వస్తే, ఈ ప్రణాళికలు ముఖ్యమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. నిర్మాణ ప్రక్రియలో ఎలివేషన్ ప్లాన్ ఎందుకు అవసరం అనే వివిధ కారణాలను గురించి తెలుసుకుందాం:

 

1. సులభమైన నిర్మాణం

ఈ ప్లాన్‌లు భవనం బయటి వివరాలు, కొలతలు, ఫినిషింగ్స్‌ ని ప్రదర్శిస్తూ బ్లూప్రింట్‌గా పని చేస్తాయి. ఇది నిర్మాణ బృందాలకు డిజైన్‌ను ఖచ్చితంగా అమలు చేయడంలో సహాయపడుతుంది, ఫలితంగా నిర్మాణ ప్రక్రియ మరింత సున్నితంగానూ మరింత సమర్థవంతంగానూ జరుగుతుంది.

 

2. సులభ నిర్వహణ 

ఇలాంటి ప్లాన్, గృహయజమానులకు వారి ఇంటి వెలుపలి భాగంలో ఏవైనా సమస్యలు లేదా మరమ్మతులు అవసరమైన వాటిని గుర్తించడం, పరిష్కరించడాన్ని సులభతరం చేస్తుంది. మెయింటెనెన్స్ ప్రక్రియ మరింత వ్యవస్థీకృతంగా ఖర్చుతో కూడుకున్నదని ఇది నిర్ధారిస్తుంది.

 

3. వనరులను ఆదా చేస్తుంది

ఎలివేషన్ ప్లాన్ ద్వారా భవనం బయట డిజైన్‌ మీద స్పష్టమైన దృష్టిని కలిగి ఉండటం ద్వారా బిల్డర్లు నిర్మాణ సమయంలో చేసే ఖరీదైన తప్పులను నివారించవచ్చు. ఇది రీవర్క్ లేదా డిజైన్‌లో మార్పులను నిరోధించడం ద్వారా సమయం, వనరులు రెండింటినీ ఆదా చేస్తుంది.

 

4. సులభమైన మార్పులు

భవనానికి మార్పులు లేదా చేర్పులు చేయవలసి వచ్చినప్పుడు ఈ ప్లాన్లు చాలా విలువైనవిగా ఉంటాయి. గదిని విస్తరించినా, కిటికీని జోడించినా లేదా రూఫ్‌లైన్‌ను మార్చినా, ఈ ప్లాన్ ఖచ్చితమైన, స్థిరమైన మార్పులు చేయడానికి రిఫరెన్స్ పాయింట్‌గా పనిచేస్తుంది.

 

5. సులభ ప్రాప్యత

ఎలివేషన్ డ్రాయింగ్‌ను డిజైన్ చేయడంలో సులభమైన ప్రాప్యత అనేది ఒక ముఖ్యమైన అంశం. ఇప్పటికే ఉన్న గోడలు లేదా చెట్లను చేర్చడం ద్వారా ఓవర్‌హాంగ్‌ల నిర్మాణానికి సవాళ్లు లేదా భవనం చుట్టూ కదలికకు ఆటంకం కలిగించవచ్చు, ఎలివేషన్ ప్లాన్ యజమాని లేదా బిల్డర్‌కు ఏవైనా సంభావ్య సమస్యలను ఊహించి, పరిష్కరించడానికి అనుమతిస్తుంది.


ఎలివేషన్ డ్రాయింగ్ అంటే ఏమిటి & ఎలివేషన్ ప్లాన్ డ్రాయింగ్‌ను గీయడానికి మార్గాలు


1. ప్రధాన అంతస్తు గోడ బేస్‌లైన్‌ని గీయడం

సాంప్రదాయ పద్ధతులను ఉపయోగించి ఎలివేషన్ ప్లాన్‌ను డిజైన్ చేయడానికి, మీరు ప్రధాన అంతస్తు గోడ బేస్‌లైన్‌ను గీయడం ద్వారా ప్రారంభించాలి. మీ ఫ్లోర్ ప్లాన్ డ్రాయింగ్‌లను సూచించడం, ఏ గోడల అడ్డం దూరాన్ని కొలవడం ద్వారానైనా ఇది చేయవచ్చు. బయట సైడ్‌వాల్స్ కోసం ఏదైనా సైడింగ్ మెటీరియల్ మందం ఉండేలా చూసుకోండి.

 

2. గోడ ఎత్తులను నిర్ణయించడం

ప్రధాన అంతస్తు గోడలను కొలిచిన తరువాత, మీరు బయట గోడల కోసం నిలువు వరుసలను గీస్తారు. అసంపూర్తిగా ఉన్న ఫ్లోర్ హైట్ కి పైన గోడలు ఎంత ఎత్తులో ఉంటాయో గుర్తించడం ముఖ్యం. భవనం సెక్షన్‌లోని గదులలోని సీలింగ్‌ల ఎత్తుని లెక్కించండి. దానికి పైన ఉన్న ఏదైనా అంతస్తు లేదా సీలింగ్ జాయిస్ట్‌ల ఎత్తును జోడించండి.

 

3. విండోస్ డోర్ అవుట్‌లైన్‌లను గీయడం

గోడ ఎత్తులను నిర్ణయించిన తర్వాత కిటికీలు, తలుపుల రూపురేఖలను గీయండి. బయట తలుపులు, కిటికీలను ఖచ్చితమైన పొజిషన్‌లో ఉంచడానికి మీ అంతస్తుల అడ్డంగా ఉండే (హారిజాంటల్) లైన్స్ నుండి కొలవండి. ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి మీ ఎలివేషన్ డ్రాయింగ్‌లోని ప్రతి ఒక్క విండో డోర్‌కు సంబంధించిన కొలతలు తీసుకోవడానికి ప్రత్యేక విండో డోర్ షెడ్యూల్‌ను సంప్రదించండి.

 

4. సీలింగ్‌లు గీయడం

సీలింగ్‌లను గీస్తున్నపుడు, మీరు ఇప్పుడు మీ ప్లాన్ కోసం కావలసిన రూఫ్‌లైన్‌ని తయారుచేయవచ్చు. కావలసిన నిర్మాణ శైలిని సాధించడానికి గేబుల్, షెడ్, హిప్ లేదా గాంబ్రెల్ వంటి వివిధ రకాల సీలింగ్ ల నుండి ఎంచుకోండి. డ్రాఫ్ట్ చేయబడే బయట ఎలివేషన్ ప్లాన్‌పై బయట గోడపై సీలింగ్ ఓవర్‌హాంగ్ అవుతుందా లేదా డ్రాప్ అవుతుందా అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోండి.  చూడడానికి ఆహ్లాదకరమైన డిజైన్‌ని ఎంచుకోండి.

 

5. డెక్స్ రెయిలింగ్‌లను కలుపుతుంది

కిటికీలు, తలుపులు, రూఫ్, బేసిక్ డ్రాయింగ్ పూర్తయిన తర్వాత, మీరు డెక్‌లు లేదా పోర్చ్‌లు, రెయిలింగ్స్‌, మెట్ల మార్గాలను జోడించవచ్చు. మీ మెయిన్ ఫ్లోర్, ఇంటి చుట్టూ ఉన్న ల్యాండ్ స్కేపింగ్ ఫైనల్ లెవల్ మధ్య ఎత్తు వ్యత్యాసాన్ని ఖచ్చితంగా కొలిచేటట్లు చూసుకోండి.

 

6. చర్చించండి

అభిప్రాయాన్నీ, అనుభవపూర్వక సలహాల్నీ సేకరించడానికి సంబంధిత వాటాదారులతో ప్రారంభ డ్రాయింగ్‌ను చర్చించండి. ఈ సహకార విధానం డిజైన్ సమగ్ర సమీక్షకు వీలు కల్పిస్తుంది. ఏవైనా సమస్యలు లేదా సవరణలు పరిష్కరించబడేలా చూస్తుంది. ప్రణాళికను సవరించడం ద్వారా డ్రాయింగ్‌ను మెరుగుపరచవచ్చు.

 

7. డిజైన్‌ను ఖరారు చేయండి

అవసరమైన మార్పులు సూచనలను చేర్చిన తర్వాత ఎలివేషన్ డ్రాయింగ్ రూపకల్పనను ఖరారు చేయడానికి ఇది సమయం.  ఇది క్లయింట్ దృష్టికి అనుగుణంగా ఉందని, బిల్డింగ్ కోడ్‌లు మరియు నిబంధనలకు అనుగుణంగా ఉందని మరియు ఏదైనా నిర్దిష్ట అవసరాలను తీరుస్తుందని నిర్ధారించుకోండి.



సారాంశమేమంటే, ఎలివేషన్ ప్లాన్ భవనం వెలుపలి భాగం ఖచ్చితమైన విజువల్ రిప్రెజెంటేషన్‌ని అందిస్తుంది. మీరు ఇంటి యజమాని అయినా, బిల్డర్ అయినా లేదా ఆర్కిటెక్ట్ అయినా, బిల్డింగ్ ప్రాజెక్ట్‌ని విజయవంతంగా పూర్తి చేయడానికి ఈ ప్రాతినిధ్యం కీలకం. వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం వల్ల మీ దృష్టిని సమర్థవంతంగా వాస్తవంలోకి తీసుకురావచ్చు.



அடிக்கடி கேட்கப்படும் கேள்விகள்

 

1. ఫ్లోర్ ప్లాన్ లేదా ఎలివేషన్ ప్లాన్- ముందుగా ఏది వస్తుంది?

సాధారణంగా, డిజైన్ ప్రక్రియలో ఎలివేషన్ ప్లాన్ కంటే ఫ్లోర్ ప్లాన్ వస్తుంది. ఎలివేషన్ డ్రాయింగ్‌లకు భవనం ఎత్తుల గురించిన నాలెడ్జి అవసరం. ఇది స్ట్రక్చర్ ఫుట్‌ప్రింట్‌ చేసిన తర్వాత మాత్రమే నిర్ణయించబడుతుంది.

 

2. ఎన్ని రకాల ఎలివేషన్స్ ఉన్నాయి?

ముందు, వెనుక, సైడ్ ఇంటీరియర్ ఎలివేషన్స్‌తో సహా అనేక రకాల ఎలివేషన్స్ ఉన్నాయి. ఈ ఎలివేషన్ డ్రాయింగ్‌లు భవనం నిర్మాణ రూపకల్పనపై ఆధారపడి విభిన్న దృక్కోణాలు వివరాలను అందిస్తాయి.

 

3. ఇల్లు నాలుగు ఎలివేషన్స్ ఏమిటి?

బాత్రూమ్ వాటర్‌ప్రూఫింగ్ ప్రభావం, ఉపయోగించే వాటర్‌ప్రూఫింగ్ మెటీరియల్  రకం, నీటి వాడకం ఎక్కువ స్థాయిలో ఉండడం, ఇన్‌స్టలేషన్ నాణ్యత వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది, . సాధారణంగా, వాటర్‌ఫ్రూఫింగ్ అవరోధానికి సంబంధించిన సమగ్రతను నిర్ధారించడానికి సాధారణ నిర్వహణ, ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటే దీని ప్రభావం దాదాపు 5-10 సంవత్సరాల వరకు ఉంటుంది.


సంబంధిత కథనాలు




సిఫార్సు చేయబడిన వీడియోలు





గృహ నిర్మాణానికి ఉపకరణాలు


ఖర్చు కాలిక్యులేటర్

ప్రతి ఇంటిని నిర్మించేవారు తమ కలల ఇంటిని నిర్మించాలనుకుంటున్నారు, కాని అధిక బడ్జెట్‌కు వెళ్లకుండా అలా చేస్తారు. 

logo

emi కాలిక్యులేటర్

గృహ-రుణం తీసుకోవడం అనేది గృహనిర్మాణానికి ఆర్థిక మార్గంగా చెప్పవచ్చు, కాని గృహనిర్మాణదారులు వారు ఎంత EMI చెల్లించాలో తరచుగా అడుగుతారు.

logo

ప్రొడక్ట్ ప్రిడిక్టర్

ఇంటిని నిర్మించే ప్రారంభ దశల్లో గృహ నిర్మాణదారు సరైన ఉత్పత్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

logo

స్టోర్ కాలిక్యులేటర్

ఇంటి బిల్డర్ కోసం, ఇంటి భవనం గురించి విలువైన సమాచారాన్ని పొందగలిగే సరైన దుకాణాన్ని కనుగొనడం చాలా ముఖ్యం.

logo

Loading....