మీ ఇంటికి ఆర్కిటెక్ట్ మరియు ఇంజినీర్ అవసరం ఎందుకు ఉంది
ఆగస్టు 25, 2020
ఆర్కిటెక్ట్‌లు మరియు ఇంజినీర్లు భిన్న పాత్రలు పోషిస్తారు.అయితే, వాళ్ళు ఇద్దరూ సమానంగా ముఖ్యమైనవారే, ప్రత్యేకించి మీ ఇంటిని నిర్మాణ ప్రణాళిక మరియు పర్యవేక్షణ దశలో. వాళ్ళు చేసే మేలు ఏమిటో అర్థంచేసుకుందాం.
ఆర్కిటెక్ట్ పాత్ర
- మీ ఇంటి ఆకృతికి రూపకల్పన చేయడం మరియు అందంగా కనిపించడంలో ఆర్కిటెక్ట్ ముఖ్య పాత్ర పోషిస్తారు.
- వాళ్ళు మీ కొత్త ఇంటికి మీ ఐడియాలు, లక్ష్యాలు మరియు భవిష్యత్తు అవసరాలను తీసుకుని, దీనికి మంచి బ్లూప్రింట్‌ని తయారు చేస్తారు.
- ఆర్కిటెక్ట్‌లకు ప్రొఫెషనల్ డిజైనింగ్ నేపథ్యం ఉండటమే కాకుండా, వాళ్ళకు భవనం కోడ్లు మరియు ఏరియాలోని నిబంధనలు గురించి కూడా బాగా తెలుసు.
ఇంజినీర్ యొక్క పాత్ర
- బాగా శాస్త్రీయ నేపథ్యం ఉండటం వల్ల, మీ ఇల్లు నిర్మాణపరంగా సురక్షితంగా ఉందని నిర్థారించుకునేందుకు ఇంజినీర్ మీ ఆర్కిటెక్ట్‌తో సన్నిహితంగా పనిచేస్తారు.
- వాళ్ళు వివిధ సాంకేతిక అంశాలను, నిర్మాణపరమైన లోడ్ పరిమితులను మరియు మెటీరియల్ పరికరాలను అర్థంచేసుకుని, ఆ ప్రకారంగా మీరు ప్రణాళిక చేసుకోవడానికి మీకు సహాయపడతారు.
- మీ ఇంటికి విద్యుత్తు వైరింగ్ మరియు ప్లంబింగ్ లేఅవుట్ల బాధ్యత కూడా ఇంజినీర్లకు ఉంటుంది.
మీ టీమ్‌లో ఆర్కిటెక్ట్ మరియు ఇంజినీర్ ఉంటే మీరు అందమైన మరియు సురక్షితమైన ఇంటిని నిర్మించుకునేందుకు సహాయపడతారు. మీ ఇంటిని నిర్మించే టీమ్‌ని ఎంచుకునేటప్పుడు వాళ్ళ ప్రాముఖ్యతను గుర్తుంచుకోండి.