మార్చి 27, 2019
ప్రణాళిక దశలో, నిర్మాణం యొక్క అనేక దశల గురించి మంచి ఐడియాలను పొందడం చాలా ముఖ్యం. ఈ దశలను దృష్టిలో ఉంచుకోవడం వలన గృహనిర్మాణదారులు ఇల్లు మరియు ఆర్థికపరిస్థితిని రెండింటినీ బాగా ప్లాన్ చేసుకోవచ్చు.
వ్యక్తిగత గృహనిర్మాణదారుడు నిర్మాణం యొక్క మూడు ప్రధాన దశలపై దృష్టి పెట్టాలి: ప్రణాళిక, భవనం మరియు ఫినిషింగ్
ప్రణాళిక: ఈ దశలో, నిర్మాణం జరగదు కానీ ఈ దశలో మీరు ఏమి ఎంచుకున్నారో అది మీ బడ్జెట్ కేటాయింపు, ఉత్పత్తి డెలివరీ టైమ్‌లైన్‌ను నిర్ణయిస్తుంది మరియు మీ ఇంటి మొత్తం రూపాన్ని. ప్రణాళికలో ఇవి ఉంటాయి:
• బడ్జెట్‌పై నిర్ణయం
• డాక్యుమెంటేషన్
• నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ప్లాట్(స్థలం)ని ఎంచుకోవడం
• మీ టీమ్ ను ఎంచుకోవడం - కాంట్రాక్టర్, ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైనర్, కార్మికులు (ఒకవేళ మీరు కాంట్రాక్టర్‌ను నియమించుకోకపోతే)
భవనం: ఈ దశలో, మీ ఇల్లు రూపుదిద్దుకోవడం ప్రారంభమవుతుంది. నిర్మాణానికి అవసరమైన అన్ని మెటీరియల్స్ ను అంటే సిమెంట్, ఇసుక, ఇటుకలు, నీరు, కంకరలను సేకరించడం మొదటి పని. మెటీరియల్స్ పొందిన తర్వాత, మీ టీమ్:
• పునాది వేయడం
• మీ ఫార్మ్‌వర్క్‌ను రూపొందించడం
• వివిధ మిశ్రమాలను సిద్ధం చేయడం
• వాటర్ఫ్రూఫింగ్
• వాల్ ప్లాస్టరింగ్
• ప్లంబింగ్
• వైరింగ్
ఫినిషింగ్: ఈ దశలో, ఇంటిని అందంగా తీర్చిదిద్దడంపై దృష్టి ఉంటుంది మరియు ఈ దశలో ఇంటీరియర్ కీలక పాత్ర పోషిస్తుంది. మీ టీమ్ - మీ బాత్రూమ్, కిచెన్, వాష్ బేసిన్లలో,రూఫింగ్, ఫ్లోరింగ్, పెయింటింగ్ మరియు ఫిట్టింగ్‌లను పర్యవేక్షిస్తుంది
మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి