కొత్త ఇంటి నిర్మాణం దశలు

అక్టోబరు 27, 2020

సొంత ఇల్లు నిర్మించుకోవాలన్నది ప్రతి ఒక్కరికి జీవితంలో అతిపెద్ద నిర్ణయం. మీ ఇల్లు మీకు గుర్తింపుకు ప్రతీక. కాబట్టి, ఇంటి నిర్మాణం యొక్క దశలన్నిటినీ అర్థంచేసుకోవడం అత్యావశ్యం. కాబట్టి మీరు మీ కొత్త ఇంటి నిర్మాణాన్ని సమర్థవంతంగా ప్రణాళిక చేసుకోవచ్చు మరియు దాని అమలును తెలుసుకోవచ్చు.

మీ గృహనిర్మాణ ప్రయాణానికి ప్రణాళిక చేసుకునేందుకు సహాయపడటం కోసం, గృహ నిర్మాణ దశలను ఇక్కడ ఇస్తున్నాము:

1. స్థలాన్ని తయారుచేయుట మరియు పునాది వేయుట

మీ ఇంటిని నిర్మించేందుకు చేయవలసిన మొట్టమొదటి పని బలమైన మరియు గట్టి పునాది వేయడమే. మొదటగా, స్థలంలో నుంచి రాళ్ళు మరియు శిథిలాలు తొలగించాలి. నేలను తవ్వడం ప్రారంభించే ముందు, స్థలంలో నీటి పరీక్ష చేయించి లేఅవుట్‌ గుర్తులు ప్రణాళిక ప్రకారం ఉన్నాయా అనే విషయం నిర్థారించుకోవాలి. తవ్వకాలు జరిపేందుకు మీ నిర్మాణ టీమ్‌ స్థలాన్ని చదును చేసి గుంతలు మరియు కందకాలు తవ్వాలి.

కాంక్రీట్‌ని పోయగానే, దానిని సెట్‌ కానివ్వాలి మరియు బాగా క్యూరింగ్‌ చేయాలి. క్యూరింగ్‌ చేసిన తరువాత, వాటర్‌ప్రూఫింగ్‌ మరియు చెదలు-నిరోధక చికిత్స చేయడం అత్యుత్తమంగా ఉంటుంది. డ్యాంప్‌ ప్రూఫ్‌ కోర్సు వేయడానికి అల్ట్రాటెక్‌ ILW+ అనువైనది. తరువాత, బురద ఉన్న పునాది గోడల చుట్టూ ఉన్న ప్రాంతాన్ని మీ టీమ్‌న బ్యాక్‌ఫిల్‌ చేయాలి.

2. ఫ్రేమింగ్‌

ఫౌండేషన్‌ సెట్‌ అవ్వగానే, చేయవలసిన పని ఇంటి స్ట్రక్చర్‌ని తయారుచేయడమే. కిటికీలు మరియు తలుపులకు ఫ్రేమ్‌లతో పాటు ప్లింత్‌లు, బీమ్‌లు, కాలమ్స్, గోడలు, రూఫ్‌ స్లాబ్‌లను ఇన్‌స్టల్‌ చేయడం దీనిలో ఉంటుంది. గదులను విభజించబడతాయి. కొత్తగా నిర్మించిన మీ ఇల్లు కచ్చితంగా ఎలా ఉంటుందో మీకు చూపిస్తారు. ఇంటి చుట్టూ ఉన్న బీమ్‌లు మరియు కాలమ్స్‌ని రాసిపెట్టుకోండి, ఎందుకంటే భవనం బరువులో అత్యధిక భాగాన్ని మోసేవి ఇవే. నిర్మాణంలో ఇది అత్యంత ముఖ్యమైన దశ, ఎందుకంటే ఇది మీ ఇంటి యొక్క దృఢత్వాన్ని మరియు నిర్మాణాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి మీ కొత్త ఇంటి నిర్మాణాన్ని పర్యవేక్షించడం కీలకం.

3. తలుపులు మరియు కిటికీలు ఏర్పాటు చేయుట

వాల్‌ ఫినిష్‌తో గోడలకు ప్లాస్టర్‌ చేశాక, కిటికీలు మరియు తలుపులను బిగించవలసి ఉంటుంది. తలుపులు మరియు కిటికీలు ఇన్సులేషన్‌ మరియు వెంటిలేషన్‌ ఇస్తాయి, కాబట్టి సరైన మెటీరియల్స్‌ని ఉపయోగించడం గురించి మీ కాంట్రాక్టరుతో మాట్లాడాలి.

4. ప్లంబింగ్‌ మరియు వైరింగ్‌

మీ ఇంటి యొక్క కాంక్రీట్‌ నిర్మాణం సిద్ధమైన తరువాత, మీరు ప్లంబింగ్‌ మరియు ఎలక్ట్రికల్‌ సిస్టమ్స్‌ ఏర్పాటు చేయడం ప్రారంభించవచ్చు. గృహ ప్రవేశం చేసిన తరువాత ఎలక్ట్రికల్‌ బోర్డులు మరియు స్విచ్‌లు ఎలాంటి అవాంతరం లేకుండా అందుబాటులో ఉండేలా  చూసుకోవాలి. కాలుష్యాన్ని నివారించేందుకు వీలుగా మురికినీటి పైపులు ఎల్లప్పుడూ తాగు నీటి పైపుల కింద ఉండాలి.

5. ఫినిషింగ్‌

చివరిగా, మీ నిర్మాణ టీమ్‌ టైల్స్‌ పరస్తుంది, ఎలక్ట్రికల్‌ బోర్డులు, క్యాబినెట్‌లు, కిచెన్‌లో కావలసినవి ఏర్పాటు చేస్తుంది. మీ ఇంటికి ఫినిషింగ్‌ డెకరేషన్‌ గురించి మీ కుటుంబ సభ్యులను సంప్రదించండి.

ఇంటి నిర్మాణంలో ప్రతి ఒక్క దశ నియంత్రణలో ఉందేలా పర్యవేక్షణ కీలకమనే విషయం గుర్తుంచుకోండి. జరుగుతున్న పనులను మరియు ఇన్వెంటరీని పరీక్షించేందుకు మీరు ప్రతి రోజూ సైట్‌ని సందర్శించాలి. మీ కొత్త ఇంటి నిర్మాణంలో ఏ దశలోనైనా మీకు సహాయం అవసరమైతే, నిపుణుల సలహా కోసం లేదా సరైన నిర్మాణ మెటీరియల్‌ని తీసుకోవడానికి,మీరు మీకు సమీపంలో ఉన్న అల్ట్రాటెక్‌ బిల్డింగ్‌ సొల్యూషన్స్‌ స్టోర్‌ని సందర్శించవచ్చు.

మరిన్ని హోమ్‌ బిల్డింగ్‌ సూచనలు మరియు సలహాలకు అల్ట్రాటెక్‌ సిమెంట్‌ వారి ‘‘బాత్‌ఘర్‌కీ’’ ని ట్యూన్‌ చేయండి.


అందుబాటులో ఉండు

మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి

చెల్లుబాటు అయ్యే పేరును నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే నంబర్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే పిన్‌కోడ్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే కేటగిరీని ఎంచుకోండి
చెల్లుబాటు అయ్యే ఉప కేటగిరీని నమోదు చేయండి

ఈ ఫారమ్‌ను సమర్పించడం ద్వారా మిమ్మల్ని సంప్రదించడానికి మీరు అల్ట్రాటెక్ సిమెంట్‌కు అనుమతినిస్తున్నారు.

దయచేసి ముందుకు కొనసాగించడానికి ఈ పెట్టెను ఎంచుకోండి