మార్చి 25, 2019
స్థలం కొనాలని మీరు నిర్ణయించుకుంటే, కావలసిన పత్రాలన్నీ ఉన్నాయని నిర్థారించుకోండి. ఇవి లేకపోతే, మీరు కొనడంలో జాప్యం జరుగుతుంది.
కావలసిన పత్రాల్లో అత్యధిక వాటిని రెండు రకాలుగా విభజించవచ్చు- లీగల్ మరియు పర్సనల్.
లీగల్ డాక్యుమెంట్లు: ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి.వీటిల్లో ఒకటి మిస్సయినా కొనుగోలులో జాప్యం జరుగుతుంది.
వీటిల్లో ఉండేవి:-
టైటిల్ డీడ్, సేల్ డీడ్ లేదా మదర్ డీడ్: విక్రేత నుంచి తీసుకోవాలి.
ల్యాండ్ క్లియరెన్స్: మీరు వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాలనుకుంటే.
ఎన్‌కంబ్రెన్స్ సర్టిఫికెట్: భూమిని రిజిస్టరు చేసే చోట సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి తీసుకోవాలి.
రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్‌ఒఆర్) సర్టిఫికెట్: తహసిల్దార్ కార్యాలయం నుంచి తీసుకోవాలి.
కాతా సర్టిఫికెట్: అసిస్టెంట్ రెవిన్యూ అధికారి నుంచి తీసుకోవాలి.
పర్సనల్ డాక్యుమెంట్స్: పర్సనల్ డాక్యుమెంట్స్ కేవలం వెరిఫికేషన్ కోసం మాత్రమే: ఆధార్, ఓటర్ ఐడి కార్డు మరియు పాన్ కార్డు.
దృష్టిలో ఉంచుకోవలసిన విషయాలు:
ఒకవేళ విక్రేత కనుక యజమాని కాకపోయివుంటే, పవర్ ఆఫ్ అటార్నీ డాక్యుమెంట్‌ని చెక్ చేయాలి.
విక్రేత పేర్కొన్న కొలతలు కచ్చితత్వంతో ఉన్నాయని నిర్థారించుకునేందుకు, సర్వే డిపార్టుమెంట్ నుంచి భూమి యొక్క సర్వే స్కెచ్ తీసుకోండి.
యజమాని ఒకరు కంటే ఎక్కువ మంది ఉంటే, యజమానులందరి నుంచి ‘విడుదల సర్టిఫికెట్’ తప్పకుండా తీసుకోవాలి.
మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి